ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహం – తన తండ్రి జ్ఞాపకార్థం నగదు బహుమతి అందించిన చంద్రమౌళి
మునిపల్లి, ఆగష్టు 15, జనంసాక్షి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులని ప్రోత్సహించాలనే సదుద్దేశంతో మల్లిఖార్జునపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు చంద్రమౌళి ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున వారి నాన్నగారి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి చిరు సన్మానం తో పాటు నగదు బహుమతి అందిస్తున్నారు.
అందులో భాగంగా ఈరోజు మల్లిఖార్జునపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన శరణ్య, గౌరిసహస్రలకు మరియు పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన మల్లిఖార్జునపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని సరితని ప్రశంసించి శాలువా పూలమాల, మెడల్ లతో సన్మానించడంతో పాటు వారికి నగదు బహుమతులు అందజేశారు.
అదే విధంగా తన స్వగ్రామం ఆరూర్ లో కూడా పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులు కీర్తన, అంజలి లకు సన్మానించి నగదు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ విమలమ్మ, ఉపసర్పంచ్ విట్ఠల్ రెడ్డి, వార్డు మెంబర్ రాజు, మల్లికార్జునపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, గ్రామ యువ నాయకులు చాకలి మల్లికార్జున్, శ్రీకాంత్ గౌడ్, హన్మంత్, నర్సింహా రెడ్డి, భాను, నరేష్, మహేష్ గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు రాజేశ్వర్, రమణ, దేవదాస్, నాగమణి, శశికళ, సృజన కుమారి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.