ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటుపడతా
– ఏపీకి ప్రధాని ఇచ్చిన ఒక్క హావిూకూడా నెరవేరలేదు
– స్వార్థప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారు
– జగన్‌తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం
– వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
విశాఖపట్టణం, మే2( జనం సాక్షి) : ఉత్తరాంధ్ర అభివృద్ధికి పాటు పడతానని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ప్రకటించారు. బుధవారం విశాఖపట్టణంలో సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పాదయాత్రకు ముందు ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్రకు మద్దుతుగా సంఘీభావ యాత్రతో ప్రజల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. పాదయాత్రలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలుసుకుంటానని చెప్పారు. మూడు దశాబ్దాల పాటు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని అభిలషించారు.
ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హావిూల్లో ఒక్కటి కూడా నేటి వరకూ అమలు నోచుకోలేదని అన్నారు. ఏపీ హావిూలను నెరవేర్చాలనే డిమాండ్‌తో గత నాలుగేళ్లుగా వైఎస్సార్ సీపీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిందని, అధికారంలో ఉన్న టీడీపీ-బీజేపీ కూటమి రాష్ట్రానికి అన్యాయం చేశాయన్నారు. ఎన్నికల ప్రచారంలో తిరుపతి వచ్చిన ప్రధాని మోదీ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేక ¬దా ఇస్తామన్నారని, విశాఖకు రైల్వే జోన్‌ను కూడా ప్రకటిస్తామన్నారు. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ప్రత్యేక ¬దా ఆంధ్ర హక్కుల అనే నినాదంతో వైఎస్ జగన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్నారన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టామని, లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేశారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ, బీజేపీలు పాటుపడటం లేదన్నారు. గతేడాది జులై 8న వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ¬దా కావాలని, ప్రజల శ్రేయస్సు కోసం వైఎస్ జగన్ నవరత్నాలను ప్రకటించారన్నారు. .
నవరత్నాలను అమలు చేస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, నవరత్నాల అమలుకు వనరులు కావాలని, తగిన వనరులు కావాలంటే ప్రత్యేక ¬దా కావాలన్నారు. చంద్రబాబు ప్రత్యేక ¬దాను నమ్మడం లేదని, వైఎస్సార్ సీపీని గెలిపించుకుంటే ఆంధప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నారు.
ప్రజాశ్రేయస్సు కోసం వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కార్యకర్తలందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలి.’ అంటూ విజయసాయి రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.