ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి
సంక్షేమ పథకాల అమలులో టెక్నాలజీని వినియోగించడం వల్ల పారదర్శకత పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన నివాస గృహం నుంచి ఆయన బుధవారం వివిధ సంక్షేమ శాఖల పనితీరుపై టెలికాన్ఫరెన్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ పారదర్శకత పెంచి సంక్షేమ పథకాలను అర్హులకు చేరేలా చూడాలని అధికారులను కోరారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థుల ఫీజులను అదే సంవత్సరం రీ-ఇంబర్స్‌మెంట్ చేస్తోందన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు.