ఉపాధి కూలీలకు దక్కని హావిూ

అనంతపురం,జ‌నం సాక్షి ): తక్కువ కూలీ ఇస్తున్నందు వల్ల కూలీలు ఉపాధి పనులపై ఆసక్తి చూపట్లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్నారు. అందుకే వలసబాట పట్టారని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున వేసవి అలవెన్సులు 50 శాతం పెంచాలని, మంచినీటికి రూ.7లు చెల్లించాలన్నారు. పని కల్పించని పక్షంలో భృతి చెల్లించాల్సి ఉన్న ఎక్కడా అమలు కావడం లేదన్నారు. చేసిన పనికి, పలుగు, పార, మంచినీటికి ఎంత బిల్లు వచ్చిందో తెలుసుకోవటానికి ప్లే స్లిప్పులు కూడా ఇవ్వట్లేదన్నారు. పని చేసిన కూలీలకు 15 రోజుల్లోగా కూలి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నెలల తరబడి బకాయిలు విడుదల కావట్లేదని, రెండు నెలల నుండి జిల్లాలో కూలి చెల్లించలేదన్నారు. పెరిగిన ధరలకు

అనుగుణంగా రూ. 250 రోజువారీ కూలి చెల్లించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హావిూ లక్ష్యాన్ని నీరుగార్చుతున్నాయని అన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో పేదలకు పనులు లేని సమయంలో పని కల్పించేందుకు వామపక్షాల ఒత్తిడి ఫలితంగా ఉపాధి హావిూ చట్టం వచ్చిందన్నారు. కానీ ప్రభుత్వాలు కూలీలకు పనిదినాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. వంద రోజుల పనిదినాలు కల్పిస్తున్న వారి సంఖ్య అమలు కావడం లేదన్నారు. రూ.192ల కనీస వేతనం అమలు చేయాల్సి ఉండగా రూ.150లకు మించట్లేదన్నారు. పనిదినాల కల్పన కంటే మెటీరియల్‌ కాంపోనెంట్‌ వినియోగానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. నిధుల్లో 60శాతం కూలీల వేతనాలకు, మిగిలిన 40 శాతం మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద ఖర్చు చేయాల్సి ఉందని, కానీ 10 శాతం కూడా కూలీలకు చెల్లించట్లేదన్నారు.

తాజావార్తలు