ఉప ఎన్నికలు వస్తే తడాఖా చూపిస్తాం
ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిందే
మహానటిపై ఆసక్తికర చర్చ
టిడిపి సమావేశంలో బాబు
అమరావతి,మే11(జనం సాక్షి ): టీడీఎల్పీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీల రాజీనామాలను జూన్ 2 తర్వాత ఆమోదించే అవకాశం ఉందని. ఉప ఎన్నికలు వస్తే తడాఖా చూపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక సారి 25 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే… మనం ఏడు సీట్లు గెలుచుకున్నామని సమావేశంలో గుర్తుచేశారు. వైసీపీ, బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, కర్ణాటకలో ఎన్జీవో నేత అశోక్‌బాబుపై దాడి చేసింది వైసీపీ వారేనని ఆరోపించారు. ఇద్దరూ కలిసి రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారని, ప్రజలకు అన్ని విషయాలను తెలపాల్సిన సమయం ఆసన్నమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ రవాణా, బెల్టుషాపులపై నేతలదే బాధ్యతనని సీఎం హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు.. ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని ఆయన ఆదేశించారు. బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించామని, ఎక్కడ తిరిగి ప్రారంభించినా నేతలే తొలగించాలని చంద్రబాబు సూచించారు.ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ రవాణా, బెల్టుషాపులపై బాధ్యత నేతలదేనన్నారు. బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించామన్నారు. ఇంకా ఎక్కడైనా తిరిగి ప్రారంభించినా నేతలే తొలగించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇదిలావుంటే మహానటి సావిత్రి బయోపిక్ చాలా బాగుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన టీడీఎల్పీ భేటీలో ఆయన మాట్లాడుతూ సావిత్రి బయోపిక్ బాగుందని ఎయిర్‌పోర్టులో కొంతమంది చెప్పారన్నారు. అలాగే మహానటి సినిమా ఎలా ఉందని నాయకులను చంద్రబాబు అడిగారు. సినిమాలో
మంచి సందేశం ఉందని, ఆ సినిమా తప్పకుండా చూస్తానని సీఎం అన్నారు. జీవిత చరిత్రలపై సినిమాలు సరిగా తీస్తే ప్రజలు ఆదరిస్తారని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఎంపీ మురళీమోహన్ మధ్య సినిమా అంశాలు చర్చకు వచ్చాయి. ‘మహానటి’ మూవీ చాలా బాగుందని కొందరు తనతో చెప్పారని ఈ భేటీలో చంద్రబాబు అన్నారు. ఈ సినిమా ఎలా ఉందని నాయకులను అడిగారు. జీవిత చరిత్రలపై సినిమాలు తీస్తే బాగా ఆదరిస్తారని చెప్పారు. ఇదే సమయంలో టాపిక్ ‘మహానటి’ సావిత్రి నుంచి ఎన్టీఆర్ సినిమావైపు వెళ్లింది. ‘ఎన్టీఆర్’ సినిమా కథ విన్నానని మురళీమోహన్ అన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణం చేసే వరకే మొదటి భాగంలో ఉందని చెప్పారు. ఈ సినిమా కూడా బాగా వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాను జనవరిలో విడుదల చేస్తే బాగుటుందని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. నందమూరి బాలకృష్ణ తీసున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. వైదొలగిన దర్శకుడు తేజ స్థానంలో పలువురి పేర్లు దర్శకుడిగా వినిపిస్తున్నాయి. అయితే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎక్కువ అవకాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ వ్యవస్థాపక దినోత్సవమైన మార్చి 29న ‘ఎన్టీఆర్’ సినిమా హైదరాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముహూర్తపు క్లాప్ కొట్టారు.