ఉమ్మడి పౌరస్మృతిపై అవగాహన సదస్సు.
రాజన్నసిరిసిల్లబ్యూరో. జులై 29. (జనంసాక్షి). ప్రస్తుతం దేశంలో ఉమ్మడి పారస్మృతి అవసరం ఎంతో ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ అన్నారు. శనివారం పట్టణంలోని సాయి కృష్ణ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి పౌరస్మృతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రధానవక్త గా హాజరైన మామిడి గిరిధర్ మాట్లాడుతూ దేశంలో ప్రజలందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలనే ఉద్దేశంతో ఉమ్మడి పౌరస్మృతి రూపొందించడం జరిగిందని అన్నారు. ఉమ్మడి పౌర స్మృతి కి సంబంధించిన అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఆడేపు రవీందర్, లగిశెట్టి శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్ గెంట్యాల భూమేష్ తదితరులు పాల్గొన్నారు.