ఊరు-వాడ కలిసి బోనాల పండుగ
రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది . గ్రామ దేవతలకు రుద్రూర్ దేశాయ్ ఇంటి వద్ద నుండి బోనం ఎత్తుకొని ఆషాఢ మాసంలో జరిగే ఈ పండుగలో ఎల్లమ్మకు ,లక్ష్మవ్వ కు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. ప్రతి వాడనుండి మహిళలు బోనం ఎత్తుకొని వచ్చి గ్రామ దేవతలకు వారి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి గ్రామ బోనాల ఊరేగింపులో బోనం ఎత్తుకొని , పోతూ రాజుల సపకును పట్టుకొని తిప్పారు, బోనాల పండుగ విశేషాలను తెలియజేశారు, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాసుల బాలరాజు కూడా తమ నాయకుల తో కలిసి బోనం ఎత్తుకున్నారు, ఈ కార్యక్రమంలో ఎంపిపి అక్కపలి సుజాత నాగేందర్, జడ్పీటిసి నారోజి గంగారాం, గ్రామ సర్పంచ్ ఇందూరు చంద్ర శేఖర్, బిఆర్ ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, తహసిల్దార్ ముజిబ్, సీఐ రవీందర్ రెడ్డి, వెంకటేశ్వరరావు దేశాయ్, అక్కపల్లి నాగేందర్, మాజీ విండో చైర్మన్ పత్తిరాము, పత్తి నవీన్, , విండో చైర్మన్ సంజీవ్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు తొట్ల గంగారాం, ఇతర గ్రామాల సర్పంచ్లు , ఎంపీటీసీలు, ఆయా పార్టీల మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, వార్డు మెంబర్ గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.