ఎపిలో బిజెపి కులం కార్డు రాజకీయాలు

వలసనేతకు అధ్యక్షపదిపై పార్టీలో గుసగుసులు
కన్నాతో పార్టీ గోదావరి ఈదేనా అన్న సందేహాలు?
అమరావతి,మే14(జ‌నం సాక్షి): బిజెపి అధ్యక్ష బాధ్యతలను ఎట్టకేలకు అందిపుచ్చుకోవడంతో మాజీమంత్రి, ఒకనాటి కాంగ్రెస్‌ నేత కన్నా లక్ష్మినారాయణకు పార్టీమారినందుకు గాను రావాల్సిన భరణం అందినట్లయ్యింది. చివరిక్షణంలో మళ్‌ఈ పార్టీ మారి వైకాపాలోకి దూకబోతున్న తరుణంలో ఆయనను పట్టుకుని కాళ్ల బేరానికి వచ్చినట్లుగా తాజా నిర్ణయంతో అరన్థం అవుతోంది. మరోవైపు కులరాజకీయాలతో ఎపిలో పట్టు సాధింఆచలన్న వ్యూహంగా నూ ఉంది. కమ్మ డామినేషఫన్‌ను దెబ్బకొట్టి కాపు రాజకీయాలకు ప్రాణం పోయాలని చూస్తున్టన్లుగా ఉంది. కాపలను దగ్గరకు చేర్చుకోవడం కోసమే కన్నా లక్ష్మీనారాణకు పదవి కట్టబెట్టారనే విమర్శలు కూడా లేకపోతేలుద. బిజెపికి తొలినుంచి పార్టీలో ఉంటూ వెన్నముకగా నిలిచిన పార్టీ నేతలను కాదని అరువుతెచ్చుకున్న నేతను రాష్ట్రపార్టీకి అధ్యక్షుడిని చేయడంతో బిజెపి చతికిల పడిందనే చెప్పాలి. సొంతగా ఓ నాయకుడిని తయారు చేసుకునే స్థితిలో పార్టీ ఉందని అర్థం అవుతోంది. ఎపిలో పాగా వేస్తామన్న బిజెపి నేతల మాటలెలా ఉన్నా, ప్రజలకు మాత్రం బిజెపికి లీడర్‌షిప్‌ లేదని అర్థమయ్యింది. అందుకే కాంగ్రెస్‌ ఇతర పార్టీ నుంచి బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో అగ్రస్థానానికి ఎదిగిన వాళ్ల నేపథ్యం సంఘ్‌తో బలంగా ముడిపడి ఉంటుంది. ఆది నుంచి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి… అంచెలు అంచెలుగా ఎదుగడం బీజేపీలో ఆనవాయితీగా వస్తోంది. తాజా నిర్ణయంతో బిజెపి సిద్దాంతాలకు విలువ ఇవ్వడం లేదని అర్తం అయిపోయింది. ఓ రకంగా ఇది కార్యకర్తల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేదిగా ఉందనే చెప్పాలి. సిద్ధాంత ప్రాతిపదికన నడిచే పార్టీగా చెప్పుకొనే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పార్టీ శ్రేణులకు మింగుడుపడని సమస్యగా మారింది.  సిద్ధాంతాలను, సీనియర్లను పక్కన పెట్టిన తీరును చూసిన వారికి రేపు మనగతి కూడా అంతే..అన్న ఆలోచనలు వస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక బలం, కులానికి బీజేపీలో ప్రాధాన్యం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాదు… వైసీపీలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకుని, చివరి నిమిషంలో ఆగిపోయిన వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  ఇటీవల అసోంలో సంఘ్‌ నేపథ్యం లేని సర్బానంద సోనోవాల్‌ను పార్టీలో చేర్చుకుని… ఎన్నికల్లో విజయం తర్వాత ఏకంగా సీఎంను చేసేశారు. ఇలా వలస నేతలను పీఠమెక్కించడం అదే మొదటిసారి. ఇప్పుడు… ఏపీలో కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. కన్నా సార్వత్రిక ఎన్నికల వరకు కాంగ్రెస్‌లో ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా కొనసాగారు. కాంగ్రెస్‌కు విభజన దెబ్బ తగలడంతో… అనూహ్యంగా బీజేపీలో చేరారు. టీడీపీ-బీజేపీ కటీఫ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. టీడీపీ పట్ల మెతగ్గా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయంతో కంభంపాటి హరిబాబును పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఇదే సమయంలో కాపు సామాజిక వర్గానికి ఆ పదవి కేటాయిస్తారనే ప్రచారం మొదలైంది. కులాలకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలో ఇటువంటి వాదన తెరపైకి రావడం బీజేపీ శ్రేణులనే ఆశ్చర్యపరిచింది. పార్టీ అధినాయకత్వం ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలో ఒకరి వైపు మొగ్గు చూపినట్లుగా వార్తలు వచ్చాయి. ఇంకా… రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రాయలసీమ నుంచి చల్లాపల్లి నరసింహారెడ్డి తదితరులు కూడా ప్రయత్నాలు మొదలెట్టారు.   అయితే కోస్తా ప్రాంతానికి చెందిన కాపు సామాజిక వర్గానికే ఇవ్వాలనుకున్నట్లు పార్టీ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఆకుల సత్యనారాయణ తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో మాజీ మంత్రి మాణిక్యాలరావును ఢిల్లీకి పిలిపించి రామ్‌మాధవ్‌ వంటి వారు మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని సూచించడంతో…
ఆర్థికంగా తనకు బలం లేదని, సోము వీర్రాజుకు అవకాశం ఇస్తే పార్టీ మరింత బలపడుతుందని సూచించినట్లు తెలిసింది. పార్టీ అధ్యక్ష పదవి చేజారుతున్న సంకేతాలు వెలువడగానే కన్నా అప్రమత్తమయ్యారు. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లాలో ఈ మేరకు కటౌట్లు, ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఆంధ్రప్రదేశ్‌లో సొంత బలం లేని బీజేపీ ఇక్కడ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగాల్సిందే. అయితే… కాంగ్రెస్‌, కమ్యూనిస్టులతో అవకాశం లేదు గనుక టీడీపీ, వైసీపీ, జనసేనతోనే కలవాలి. టీడీపీతో బాగా చెడినందున… మిగిలిన బలమైన పార్టీ వైసీపీ ఒక్కటే. ఎన్నికల సమయంలో ఆ పార్టీతో మంత్రాంగం నెరిపేందుకు కాంగ్రెస్‌ రాజకీయాలు తెలిసిన అనుభవజ్ఞుడైన కన్నాలాంటి వారుంటేనే మంచిదని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు పార్టీల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనుభవజ్ఞుడైన కన్నాను అధ్యక్ష స్థానంలో నియమించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు… పరిస్థితిని బట్టి జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌తోనూ సంబంధాలు నెరపగలరని కూడా బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. సోము వీర్రాజును అధ్యక్షుడిగా చేయాలనే ప్రతిపాదనపై భారీగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ దశలో పార్టీ వీడేందుకు సిద్దమైన కన్నాను కర్ణాటక ఎన్నికలు ముగిసే వరకూ ఆగాలని, ఆ తర్వాత ఏపీపైనే పూర్తి దృష్టి సారిస్తామని, తగిన న్యాయం చేస్తామని  బిజెపి అధిష్టానం  బుజ్జగించారు. అనుకున్నట్లే కర్ణాటక పోలింగ్‌ ముగిసిన వెంటనే కన్నా లక్ష్మీనారాయణ నియామకంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా కులసవిూకరణాలు బిజెపికి కలసివస్తాయా లేదా అన్నది చూడాలి.
—————————-

తాజావార్తలు