ఎయూ ప్రతిష్టను పెంచేందుకు చర్యలు

విశాఖపట్టణం,మార్చి31(జ‌నంసాక్షి): అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దడానికి  ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో ఉన్నతంగా పేరు సంపాదించిన యూనివిర్సిటీ ఇటీవలి కాలంలో తన ప్రాభవాన్ని కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో దీనిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు రచించి అమలు చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరి ఆధ్వర్యంలో సవిూక్షించారు. ఏయూను ప్రపంచ ప్రతిష్ట విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా తగిన చర్యలు సాధ్యమైనంత వేగంగా తీసుకోవాలని తీర్మానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయానికి, పరిశ్రమకు, పారిశ్రామికరంగ ప్రముఖులకు పరస్పర అవగాహన ఏర్పడి వర్సిటీకి మరింత ప్రాచుర్యం, గుర్తింపు లభించటమే కాకుండా పారిశ్రామిక అవసరాలకుతగ్గ సుశిక్షితులైన మానవవనరులు లభిస్తాయని వారు సమాలోచనలు చేశారు. రానున్న రోజుల్లో మరికొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒక ప్రణాళిక ఖరారు చేయాలని నిర్ణయించారు.

తాజావార్తలు