ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
కడప, జనం సాక్షి ) : కడప శివారులోని వాటర్‌గండి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న 12 మంది తమిళ స్మగ్లర్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో స్మగ్లర్లను అరెస్టు చేసి 366కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన స్మగ్లర్లను కడప డీఎస్పీ మాసుంబాషా విూడియా ఎదుట హాజరు పరిచారు. వాటర్‌గండి అటవీప్రాంతంలో తమిళ స్మగ్లర్లు ఎర్రచందనం చెట్లను నరికి వాటిని వాహనాల్లో వేసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం రావడంతో చిన్నచౌకు పోలీసులు తమ సిబ్బందితో రెండు బృందాలుగా విడిపోయి వారిపై దాడులు చేసినట్లు తెలిపారు. అరెస్టైన స్మగ్లర్లందరు తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వారు. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన కొన్ని వందల మంది స్మగ్లర్లు కడప కేంద్ర కారాగారంలో ఉన్నారని డీఎస్పీ చెప్పారు. ఎర్రచందనం జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.