ఎస్టీ రైతులకు అవగాహన జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్

 

 

 

మహా ముత్తారం జులై 14 (జనం సాక్షి) బోర్ల గూడెం రైతువేదికలో ఎస్టీ రైతులకు అవగాహన కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి సతీష్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ రెవెన్యూ పట్టా ఉన్న పాత పోడు అక్కుపత్రం ఉన్న పక్కన ఉన్న రైతులు కలిసి5-10 ఎకరాలు గ్రూపుగా ఏర్పడి ఆయిల్ ఫామ్ పంట సాగుకు సిద్ధంగా ఉంటే వారికి గిరి వికాస్ పథకం కింద ఉచితంగా బోర్ సదుపాయం కల్పిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్ రైతులకు తెలిపారు. అలాగే పక్క పక్కన చేను కలిపి ఉన్న ఎస్టీ రైతులు గ్రూపుగా ఏర్పాటు కావాలని మీరు అనుకోని ఆయిల్ ఫామ్ పంట వేయటానికి సిద్ధంగా ఉన్న రైతులు పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డ్, కులం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్, జాబ్ కార్డు మీ గ్రామ విస్తీర్ణ అధికారికి ఈ నెల చివరి లోపు బోర్లగూడెం రైతు వేదిక, ముత్తారం రైతు వేదిక, స్థలం పెళ్లి రైతు వేదిక లో ఉన్న సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని వారు వివరిస్తూ తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి సర్పంచ్ వనజ, ఎంపిటిసి వెంకటేష్, మండల వ్యవసాయ అధికారి సతీష్, విస్తీర్ణ అధికారి అస్మా, హెచ్ ఓ రమేష్, పి ఏ సి ఎస్ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రైతు కన్వీనర్లు రైతులు పాల్గొన్నారు.

తాజావార్తలు