ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై నేడు ప్రభుత్వానికి తుది నివేదిక
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిథుల వినియోగంపై అధ్యయనానికి ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘల రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు తుది నివేదికను సమర్పించనుంది. నిధులు సమర్థ వినియోగానికి ప్రత్యేక సాధికార సంస్థను ఏర్పాటు చేయాలని ఇందులో సిఫార్సు చేసినట్లు సమాచారం. ఉపప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహించాలని సూచించనున్నట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఏర్పాటైన ఉపసంఘవ వివిధ శాఖలు, కులసంఘాలు, అఖిలపక్ష నేతలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసింది. తద్వారా వచ్చిన అభిప్రాయాలతో తుదినివేదికను రూపొందించిన ఉపసంఘం నేడు దాన్ని ముఖ్యమంత్రికి సమర్పించనుంది
విద్యుత్ కోతలతో ఎండిన పంటలను పరిశీలించనున్న తెరాస బృందం
హైదరాబాద్: విద్యుత్ కోతలపై పోరును తెరాస ఉద్ధృతం చేసింది. కోతల కారణంగా ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేల బృందం బయలు దేరివెళ్లింది. రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ఎండిన పొలాలను నేతలు పరిశీలించనున్నారు.
నేడు ఢీల్లికి జేపీ
హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ అజెండా ఫర్ ఇండియా అనే సదస్సులో పాల్గొనడానికి శనివారం ఢిల్లీ వెళ్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘ పాలనా సంస్థ పట్ల విశ్వసనీయతను పునరుద్ధరించంటం’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు.