ఏనుగుల దాడి..

a3it7pcmచిత్తురు : జిల్లాలో మళ్లీ గజరాజులు పంట పొలాలపై దాడులు చేశాయి. ఎన్నో రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎర్రవారిపాలెంలోని అనే ప్రాంతాల్లో ఆదివారం రాత్రి పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేశాయి. దీనితో టమాటతో పాటు ఇతర పంటలు ధ్వంసమయ్యాయి. తమ పంటలను కాపాడేందుకు రైతులు విశ్వప్రయత్నాలు చేశారు. గత 15 రోజులుగా రామకుప్పం, కుప్పం, కాంచీపురం ప్రాంతాల్లో గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో నీటి కొరత కారణంగానే గ్రామల్లోకి ఏనుగులు ప్రవేశిస్తున్నాయని తెలుస్తోంది. వీటికి ఇటీవల అధికారులు సాగునీటి సదుపాయం కల్పించినా అందులో లోపాలు ఉండడంతో మళ్లీ ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.

తాజావార్తలు