ఏపీకి నాబార్డ్ సాయం రూ.12,192 కోట్లు
అమరావతి,మే10(జనం సాక్షి): గత ఆర్థిక సంవత్సరంలో ఆంధప్రదేశ్‌కు రూ.12,192 కోట్ల సాయం అందించినట్లు నాబార్డ్ వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంతగా 30 శాతం అధికంగా రాష్ట్రానికి సాయం చేసినట్లు వివరించింది. ఏపీలో సహకార బ్యాంకులకు స్పల్పకాలిక రుణాలుగా రూ.4,740 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపింది. వివిధ ప్రాజెక్టులకు రూ.4,586 కోట్ల మేర దీర్ఘకాలిక రుణాలు అందించినట్లు వివరించింది. ఐదేళ్ల పక్రియలో భాగంగా ఉద్యాన పంటలు, పాలఉత్పత్తి , వ్యవసాయ యాంత్రీకరణ, మత్స్య ఉత్పత్తుల పెంపునకు కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించింది. వ్యవసాయోత్సత్తిలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు మరో రూ.1,004 కోట్ల సాయం కూడా రాష్టాన్రికి అందించనున్నట్లు
తెలిపింది. గ్రావిూణ ప్రాంతాల్లో విద్యుత్‌సరఫరా లైన్లను ఏర్పాటుచేసేందుకు ఏపీ ట్రాన్స్‌కోకు రూ.346 కోట్లు మంజూరు చేశామని వెల్లడించింది.