ఏపీలో ఎపి పర్స్ యాప్ ప్రారంభం
విజయవాడలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నోట్ల రద్దు అనంతర పరిణామాలపై బ్యాంకర్లు, ఆర్‌బిఐ ఉన్నతాధికారులతో సిఎం మంగళవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి పర్సు అనే యాప్‌ను ప్రారంభించారు. ఆ యాప్ ద్వారా తొలి లావాదేవీని మార్పు-మీ నేస్తం విధానంలో ఆయన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం అనకే చర్యలు తీసుకుంటోందన్నారు. మొబైల్, కార్డుల లావాదేవీలు పెరగాలన్నారు. నగదు రహిత లావాదేవీలు మరింత సులభంగా చేసుకోవడానికి వీలుగా ఎపి పర్స్ యాప్ సిద్ధం చేశామన్నారు. 10 వాలెట్ కంపెనీలు, 13 బ్యాంక్‌లు ఈ యాప్‌లో సభ్యులని తెలిపారు. ఆ సంస్థల్లో ఒకటి ఎంచుకున లావాదేవీలు నిర్వహించవచ్చన్నారు. యాప్ వినియోగంపై క్యాష్ బ్యాక్ సౌకర్యం ఉందని, రిజిస్టర్ చేసుకున్నప్పుడు 60 రూపాయలు వాలెట్‌గా ఇస్తారన్నారు.