ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
– ఇంజనీరింగ్ విభాగంలో 72.28శాతం
– అగ్రికల్చర్ విభాగంలో 87.6శాతం మంది ఉత్తీర్ణత
– మే 26 నుంచి కౌన్సిలింగ్, జూన్ 11 నుంచి క్లాసులు
– వెల్లడించిన మంత్రి గంటా శ్రీనివాస్‌రావు
విజయవాడ, మే2( జనం సాక్షి) : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉదయం విశాఖలో ఎంసెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,90,922 మంది పరీక్ష రాయగా 1,38017 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 72.28గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గింది. 8,529 మంది ఎంసెట్‌లో ర్యాంక్ వచ్చి ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందలేదు. 1,26,197 మందికి ర్యాంకులు కేటాయించారు. అలాగే అగ్రికల్చర్ విభాగంలో 73,373 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 63,883 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణత శాతం 87.6గా ఉంది. అగ్రికల్చర్ విభాగంలోనూ 2,668 మంది ఎంసెట్‌లో ర్యాంక్ వచ్చి ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందలేదు. 58,927మందికి ర్యాంకులు కేటాయించారు. మొత్తం 137 పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ పరీక్ష
నిర్వహించారు. మే 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనుండగా, జూన్ 11 నుంచి క్లాసులు ప్రారంభంకానున్నాయి.
ఇంజనీరింగ్‌లో టాపర్స్…
భోగి సూరజ్ కృష్ణ- మొదటి ర్యాంక్ – (95.27), గట్టు మైత్రేయ రెండో ర్యాంక్(94.93), పిన్నమరెడ్డి లోకేశ్వర్‌రెడ్డి – మూడో ర్యాం క్ (94.22), జి.వినాయక్ శ్రీవర్థన్ – నాలుగో ర్యాంక్ (94.20), షేక్ వాజిద్ – ఐదో ర్యాంక్ (93.78), బసవరాజు జిష్ణు – ఆరోర్యాంక్(93.51), వంశీనాథ్ -ఏడో ర్యాంక్, కేవీఆర్ హేమంత్ కుమార్ – ఎనిమిదో ర్యాంక్ (92.71), బడ్డపాటి యజ్ఞేశ్వర్ – తొమ్మిదో ర్యాంక్ (92.67), ముక్కు విష్ణుమనోజ్ఞ – పదో ర్యాంక్(92.56),
అగ్రికల్చర్, మెడికల్‌లో టాపర్స్ ..
జంగాల సాయిప్రియ – మొదటి ర్యాంక్ (94.78), గంజికుంట శ్రీవాత్సవ్ – రెండవ ర్యాంక్(93.26), కోడూరు శ్రీహర్ష – మూడో ర్యాంక్(92.47), గుండె ఆదర్శ్ – నాలుగో ర్యాంక్ (92.12), షేక్ జానూబాయ్ రఫియా – ఐదో ర్యాంక్(91.95), ఉద్దేవి జయసూర్య – ఆరో ర్యాంక్ (91.95), నల్లూరి వెంకట్ విజయకృష్ణ – ఏడవ ర్యాంకు (91.31), వెంకటసాయి అమృతనీలి – ఎనిమిదవ ర్యాంకు(91.21), వీఎన్ తరుణ్ వర్మ – తొమ్మిదో ర్యాంకు (91.18), ఒంటేరు వెంకటసాయి హర్ష వర్థన్‌రెడ్డి – పదవ ర్యాంకు (91.16).