ఏపీ సీఎం వద్దకు విద్యుత్‌ ఫైలు

chandrababu-naidu-pti_647_080216012602విద్యుత్‌శాఖలో ఆర్థిక లోటును భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రూ.8వేల కోట్ల నిర్వహణ లోటు కొనసాగుతోందని, దీనిలో కనీసం ఐదు లేదా తొమ్మిది శాతాన్ని భర్తీ చేసుకోవాలనే అంశంపై నివేదికను తయారు చేసే బాధ్యతను కన్సల్టెన్సీకి అప్పగించారు. ఆ నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వద్దకు పంపనున్నారు. సిఎం అంగీకరిస్తే విద్యుత్‌ నియంత్రణ మండలి అనుమతి తీసుకుని ప్రజలపై భారం వేయనున్నారు. కన్సల్టెన్సీ నివేదిక ప్రకారం విద్యుత్‌ ఛార్జీల పెంపు భారం రూ.1500 కోట్ల నుండి రూ.2700 కోట్ల వరకూ ఉండొచ్చని తెలిసింది.  2009 నుండి విద్యుత్‌లో తీవ్ర నష్టాలు వస్తున్నాయని కనీసం రూ.12,700 కోట్లు పెంచకపోతే నష్టపోతామని, 2012లో 2013లో ఫిబ్రవరి 19వ తేదీన విజయవాడలో బహిరంగ విచారణ నిర్వహించారు. ఆ సమయంలోనూ నిర్వహణ లోటు రూ.8200 కోట్లుందని విద్యుత్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉమ్మడిగా ఇఆర్‌సికి నివేదిక సమర్పించాయి. అప్పట్లో పెద్దఎత్తున విద్యుత్‌ లోటుందనే పేరుతో బొగ్గు కొనుగోలు, ప్రైవేటు విద్యుత్‌ సంస్థల నుండి యూనిట్‌ రూ.6.40పైసల నుండి రూ.9.00 వరకూ కొనుగోలు చేశారు. ఆ భారాన్ని కూడా ప్రజల నుండి వసూలు చేశారు. 2009 నుండి కొనసాగుతూ వస్తున్న ఎనిమిదివేల కోట్ల నిర్వహణ లోటును ఈ ఏడాది ప్రజల నుండి వసూలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కన్సల్టెన్సీని పెట్టి నివేదికలు రూపొందించింది. 

తాజావార్తలు