ఓటరు అవగాహన కార్యక్రమం
చొప్పదండి ఆగస్టు 11 (జనం సాక్షి) :మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లోఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ ఏ శరత్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లల్లో ఓటు వేసే విధంగా చూడాలని తెలిపారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో చొప్పదండి కళాశాల నుండి హర్యానాలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో కళాశాల నుండి పాల్గొన్న ఇద్దరు విద్యార్థులకి సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఏ లక్ష్మణ్ కుమార్ ,ఎల్ కనకయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సబితా రాణి , కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.