కంటోన్మెంట్ ను అభివృద్ధి చెయ్యని బీఆర్ఎస్,బిజెపి లు మా రేవంత్ రెడ్డి ని విమర్శించే అర్హత లేదు: కాంగ్రెస్ నాయకులు డి.పి.దేవేందర్

కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 29 కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అన్నా నగర్,రసూల్ పూర ప్రాంతాలను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు దత్తత తీసుకొని చేస్తామని గతంలో ప్రకటించారని, అప్పటినుంచి స్థానిక ప్రజలు ఎదురుచూస్తూ ఉండిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డి.బీ దేవేందర్ విమర్శించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధి గురించి జరుగుతున్న పరిణామాలు గురించి విలేకరుల సమావేశంలో విషయాలు మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్కాజిగిరి ఎంపీ ఏ.రేవంత్ రెడ్డి తప్పిపోయాడని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు అజ్ఞాతంగా ఉండి పోస్టర్లు వేస్తున్నారని మరి సీఎం కూడా కంటోన్మెంట్ అన్నా నగర్ ను దత్తత తీసుకుంటానని ప్రకటించారని అప్పటినుంచి ఆయన కూడా కనిపించడం లేదని అన్నానగర్ ప్రజలు అంటున్నారని ఆయన అన్నారు,తప్పిపోయాడని పోస్టర్లు వేసే నిజ సంస్కృతి మాది కాదని దేవేందర్ ప్రకటించారు. వివక్షత లేకుండా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని చూడాలని ఆయన డిమాండ్ చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వాటిని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కంటోన్మెంట్ కు రావలసిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే చెల్లించాలని ఆయన కోరారు, ప్రజా సమస్యలు పట్టించుకోవటం లేదు ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి నాయకుడు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో వినోద్, నాగేష్,బాబురావు, గజ్వేల్ భరత్,ప్రకాష్, షేక్ ఇమామ్, శ్రీనివాస్,సాల్మన్, దాస్, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు