కంది మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ

– మన సంస్కృతి సాంప్రదాయాలతో తెలంగాణ అభివృద్ధి

-ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం

 

 

 

 సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి, జూలై 14 ::కంది మండల కేంద్రంలోనీ   పద్మశాలి బోనాల జాతర శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పట్నమాణిక్యమును పద్మశాలి సోదరులు శాలువతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పట్నం మాణిక్యం మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మన శాస్త్రి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు అన్నారు.మన సంస్కృతి సాంప్రదాయాలు వచ్చే తరానికి ఆచరణీయంగా మారుతాయని ఆయన గుర్తు చేశారు.ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో పట్నం మాణిక్యం  పాటు కంది పద్మశాలి సంఘం అధ్యక్షులు కృష్ణ,  శ్రీరాములు  మరియు గ్రామ మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు