కడప ఉక్కుతోనూ ఉద్యోగాలకు ముక్తి

కడప,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే కడప మరో విశాఖగా మారుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి జగదీశ్‌ అన్నారు. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీకి అవకాశాలు ఉన్నా దనీఇపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్నారు. గతంలో ఉక్కు ఫ్యాక్టరీకి హావిూ ఇచ్చిన సిఎం చంద్రబాబు కూడా దీనిని పట్టించుకోవడం లేదన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో ప్రాంతీయ అసమానతలు తగ్గు తాయన్నారు. ఎపిఎండిసి, ఆర్‌టిపిపి ప్రాజెక్టుల్లో బీహార్‌ వాసులకు ఉపాధి కల్పించడం శోచనీ యమన్నారు.కార్మిక చట్టాలను కాలరాయడం తగదని, కార్మికులు దేశవ్యాప్త పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.పరిశ్రమలు రావడానికి కార్మికుల వేతనాలకు లంకె పెట్టడం దారుణమన్నారు. కార్మికుల వేతనాల పెంపు పెట్టుబడిదారులకు భారమని చెప్పడం విచారకరణమని తెలిపారు. కార్మిక సంఘాలను అణచివేస్తేనే పెట్టు బడులు వస్తాయని భావించడం మూర్ఖత్వమన్నారు. తెలంగాణా తరహాలో ఆశాలు, గ్రామసేవకుల, అంగన్వాడీలకు వేతనాలు ఇవ్వాలన్నారు. నారాయణ విద్యాసంస్థ 30 మంది ఆత్మ హత్యలకు కారణమైందని, అటువంటి సంస్థ చేతిలో అంగన్వాడీ పిల్లలను పెట్టడం ఆందోళనకరమన్నారు.నారాయణ విద్యాసంస్థల మృతులపై సిబిఐతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా ఐదేళ్లుగా కరువుతో సత మతమైందన్నారు.

 

తాజావార్తలు