కడప ఉక్కు కోరుతూ బంద్‌

కడప,జనవరి25(జ‌నంసాక్షి): ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు,వైసిపి కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా బంద్‌ నిర్వహించారు. కడప ఉక్కు..సీమ హక్కు అంటూ నినదించారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్దకు భారీ ఎత్తున చేరుకొని బస్సులను నిలిపివేశారు. వల్లూరు, జమ్మలమడుగులో నాయకులను అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించారు. వేంపల్లిలో వైసిపి నాయకులు షబ్బీర్‌వల్లి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వకార్యాలయాలు, బ్యాంకులను మూయించేశారు. కడప ఉక్కు- మాహక్కు అంటూ పెద్దఎత్తున ప్రజలు, యువత బంద్‌లో పాల్గన్నారు. అయితే అరెస్టులపై స్పందించిన వైసిపి నేతలు శాంతియుతంగా బంద్‌ చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం రాయలసీమ అభివ అద్ధిని మర్చిపోయిందని విమర్శించారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మండిపడ్డారు.

తాజావార్తలు