కడప: పాఠశాలల మూసివేత జీవోను రద్ధుచేయాలి

వేంపల్లె: తెలుగు మీడియం ఉన్న పాఠశాలలను మూసివేసే జీవోను రద్ధుచేయాలని ఎస్టీయూ నేతలు డిమాండ్‌ చేశారు. తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియం సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం ఎస్టీయూ కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిలర్‌ నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శివశంకర్‌రెడ్డి, రీజనల్‌ కన్వీనర్‌ సంగమేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయరాజు, రాజశేఖర్‌, శ్రీనివాసరెడ్డి, ధర్మారెడ్డి, సంగిరెడ్డి, సాంబశివారెడ్డి, జి శివారెడ్డిలు సమావేశం అయ్యారు. జీవోపై చర్చించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్ధుచేయకుండా సమాంతరంగా నిర్వహించాలని, ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లమాధ్యమం ఏర్పాటుచేయాలని కోరారు. ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చిన తర్వాత ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.

తాజావార్తలు