కనకరదుర్గమ్మ సేవలో నారాయణస్వామి

విభజన హావిూలను కేంద్రం తుంగలో తొక్కిందని వ్యాఖ్య
విజయవాడ,మే7(జ‌నం సాక్షి): పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి సోమవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆర్ధిక మంత్రుల సమావేశంలో పాల్గోనేందుకు విజయవాడ వచ్చిన ఆయన అమ్మవారి మూలవిరాట్టును దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.  ఆలయ మర్యాదలను అనుసరించి ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు.. అమ్మవారి ఆశీర్వచనాలు అందించారు. ఈవో, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు ప్రసాదాలు అందించారు. అమ్మవారిని దర్సించుకున్న అనంతరం ఆయన అమరావతిలో నిర్వహిస్తున్న ఆర్ధిక మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఉప సంఘం సభ్యుడిగా విభజన చట్టంలో ప్రత్యేక ¬దాను పొందుపరిచామని పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాలతో సమానంగా ఏపీకి ¬దా ఇవ్వాలని స్పష్టం చేశామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు కేంద్రం ఇవ్వాలని పేర్కొన్నారు. పోలవరానికి రూ.40వేల కోట్లు అవుతుందని అంచనా వేశామన్నారు. రాజధానికి రూ.50వేల కోట్లు ఇవ్వాలని పార్లమెంట్‌లో చెప్పాం. పోలవరానికి రూ.2,500 కోట్లు, అమరావతికి 1,500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎలా? విభజన హావిూలు పూర్తి చేసే విషయంలో కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరితో ఉంది. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌కు మోసం చేశారు. ఏపీ సొంతంగా వనరులు సాధించుకోలేని పరిస్థితిలో ఉంది. ఏపీని మోసం చేసిన భాజపాకు కర్ణాటకలోని తెలుగు ప్రజలు బుద్ధి చెప్పాలి. విదేశాల్లో నల్లధనం తెస్తామని చెప్పి.. ప్రజల చేతుల్లో డబ్బులు లాగేసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు పూర్తిగా తప్పుడు నిర్ణయం. దేశ ఆర్థిక ప్రగతి కుంటుపడింది, వృద్ధిరేటు 6 శాతానికే పరిమితమైంది. ప్రధాని మోదీ విదేశాంగ మంత్రిగా మారి విదేశాలకు తిరుగుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో భాజపా గెలవదు అని నారాయణస్వామి అన్నారు. కేంద్రం పన్నుల వాటా చెల్లింపులో పాండిచ్చేరికి అన్యాయం జరిగిందని పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. రాష్టాల్రకు 42 శాతం ఇస్తూ తమ రాష్ట్రానికి కి మాత్రం 27 శాతం ఇస్తున్నారని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం టర్మ్స్‌ అఫ్‌ రిఫరెన్స్‌ రాష్ట్రాలల గొడ్డలిపెట్టని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.

తాజావార్తలు