కన్నడ సంఘాల దాడులపై బాబు సీరియస్‌

తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కర్నాటకకు వినతి

కర్నాటక సర్కార్‌తో మాట్లాడాలని స్పెషల్‌ సిఎస్‌కు ఆదేశాలు

అవసరమైతే కేంద్రంతో మాట్లాడుతానని వెల్లడి

అమరావతి,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): కర్ణాటకలో జాతీయ పోటీ పరీక్షలు రాసే తెలుగు విద్యార్ధులు ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. కర్ణాటకలో తెలుగు విద్యార్ధులపై దాడి అంశంపై కర్ణాటక సీఎస్‌, డీజీపీ, కేంద్ర ¬ంశాఖ అధికారులతో మాట్లాడాలని సీఎం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్రను చంద్రబాబు ఆదేశించారు. అంతేగాక అవసరమైతే ఆరాష్ట్ర ముఖ్యమంత్రి, కేందప్రభుత్వంతో మాట్లాడతానని చంద్రబాబు పేర్కొన్నారు. రేఅక్కడ జరిగే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. కర్ణాటకలో తెలుగు విద్యార్థులను పరీక్షలు రాయకుండా కన్నడ సంఘాల ప్రతినిధులు అడ్డుకుంటున్న ఘటనను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. తెలుగు విద్యార్థులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై కేంద్రంతో మాట్లాడతానని మంత్రులకు సీఎం చెప్పారు. అవసరమైతే కర్ణాటక ముఖ్యమంత్రితోనూ చర్చిస్తానని తెలిపారు. ఈ ఘటనపై వెంటనే కర్ణాటక సీఎస్‌తో మాట్లాడాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర కర్ణాటక సీఎస్‌తో మాట్లాడారు. తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాలని కోరారు. సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో కర్ణాటక ఘటనను మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో బ్యాంకింగ్‌ పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి కన్నడ సంఘాల నేతలు అడ్డుకున్నారు. విద్యార్థులను పరీక్షా హాల్‌ వద్ద అడ్డుకొని హాల్‌ టికెట్లు చించివేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి కన్నడ సంఘాల నేతలను అడ్డుకున్నారు కాగా… తెలుగు విద్యార్ధులపై దాడి అంశాన్ని తెలుగుదేశం పార్టీ

సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రులు కాల్వ శ్రీనివాసులు. ఆదినారాయణరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

తాజావార్తలు