కన్వీనర్ కోటా సీట్లు దుర్వినియోగం చేస్తే కఠినచర్యలు – మంత్రి కామినేని
విజయవాడ, ఆగస్టు 5 : ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. అవసరమైతే ఎంసీఐతో చర్చించి కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామన్నారు. కన్వీనర్ కోటా కింద సీటు తీసుకొని వదిలివేస్తే విద్యార్థుల సర్టిఫికెట్లను హోల్డ్‌లో పెడతామని మంత్రి ప్రకటించారు. విద్యార్థులను డిబార్ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి వివరించారు