కపిలతీర్థం పుష్కరిణిలో పడి నలుగురి మృతి

hj38gqqwతిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కపిల తీర్థం జలపాతంలో భక్తులు గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి పదకొండున్నర గంటల సమయానికి ఏడు మృతదేహాలను వెలికి తీశారు. వీరిలో నలుగురు తిరుపతి చంద్రశేఖర రెడ్డి కాలనీకి, మరో ముగ్గురు మధురానగర్, యువజ్యోతి నగర్ వాసులు. కపిలతీర్థం జలపాతం నుంచి మరో మృతదేహాన్ని రెస్క్యూ టీమ్స్ సోమవారం వెలికి తీశాయి. అత్ని వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఆదివారం సాయంత్రం ఏడు మృతదేహాలను వెలికి తీసిన విషయం తెలిసిందే మృతులను శ్రీకాంత్, వెంకటేష్, లోహిత్, నిఖిల్, బాలాజీ, సచిన్ వర్మ, తౌసిద్‌లుగా, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. మరికొందరు మృతి చెంది ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇంటినుంచి వెళ్లిన పిల్లలు శవాలయ్యారని తెలుసుకున్న తల్లితండ్రుల గుండెలు పగిలాయి. సమాచారం తెలుసుకున్న టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇవో సాంబశివరావు, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పుష్కరిణిలోని మృతదేహాలను వెలికితీయించారు. మరికొందరు గల్లంతైనట్టు అనుమానాలు ఉండటంతో, అర్థరాత్రి వరకూ గాలింపు చర్యలు కొనసాగాయి.

తాజావార్తలు