కమాన్ పూర్ మండలానికి తహసిల్దార్ ను వెంటనే నియమించాలి – విలేకరు సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు
జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్పూర్ మండలానికి వెంటనే తాసిల్దార్ నియమించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వైనాల రాజు డిమాండ్ చేశారు. సోమవారం కమాన్ పూర్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు జడ్పిటిసిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కమాన్ పూర్ మండలానికి తాసిల్దార్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న జడ్పీ చైర్మన్ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ తాసిల్దార్ బదిలీ అయి వారం రోజులు గడుస్తున్నా కొత్తగా తాసిల్దారును నియమించకపోవడం, ఇంచార్జ్ తాసిల్దారుగా డ్యూటీకి బాధ్యతలు అప్పజెప్పిన అతను రెవెన్యూ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కుల, ఆదాయ, ఇతరత్రా సర్టిఫికెట్ల కొరకు వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గృహలక్ష్మి కొరకు హక్కు పత్రాలు కుల, ఆదాయ సర్టిఫికెట్ కొరకు కార్యాలయం చుట్టూ ప్రజలు తిరుగుతున్నారని పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపించారు.
తాసిల్దార్ పోవడంతో భూ రిజిస్ట్రేషన్లకు స్లాట్స్ బుకింక్ చేసుకున్న వారు తిరిగి రీ షెడ్యూల్ చేసుకునే దుస్థితి నెలకొందని, దీంతో వారి పై అదనపు భారం పడుతుందని అన్నారు. అనంతరం అనారోగ్యముతో మృతి చెందిన ప్రజగాయకుడు గద్దర్ కి కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలియజేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ విలేకరుల సమావేశంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మల్యాల తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు భాద్రపు శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు పిడుగు శంకర్, శ్రీనివాస్ బూస తిరుపతి, ఉప సర్పంచ్ గుమ్మడి సతీష్,మాజి సర్పంచ్ దాసరి గట్టయ్య, కుందరపు బాపు, మాజి కో ఆప్షన్ అబ్దుల్ రఫీక్, మంథని నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచర్జ్ పెండ్యాల రాజు, చోప్పరి శేకర్ , చొప్పరి తిరుపతి నగునురి నర్సయ్య, చాట్లా రాయమల్లు, రమేష్, దాసరి రాజేష్, బుర్ర సత్యం గౌడ్, సాయి,శేకర్, మామిడి రాజు అనవేనా చిన్న రవి తదితరులు ఉన్నారు.