కరోనాతో కబడుదాం
అధికారు సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్,మే 11(జనంసాక్షి):కరోనా వ్యాప్తి నివారణ చర్యు తీసుకుంటూనే, కరోనాతో కలిసి జీవించే వ్యూహం రూపొందించాని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారును ఆదేశించారు. కరోనా ఎంతకాం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉందని, కాబట్టి కరోనా ప్రభావం ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగానే విషయంలో ఖచ్చితమైన వ్యూహం, ప్రణాళిక అవసరమని సిఎం అన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యు, లాక్ డౌన్ అము తదితర అంశాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సవిూక్ష నిర్వహించారు. హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ముఖ్య సహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, ముఖ్య కార్యదర్శు ఎస్. నర్సింగ్ రావు, రామకృష్ణ రావు తదితయి పాల్గొన్నారు.‘‘కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యు తీసుకోవాలి. వైరస్ వచ్చిన వారికి ఇప్పటి మాదిరిగానే అత్యుత్తమ సేమ అందాలి. కాంటాక్ట్ వ్యక్తు పరీక్షు జరగాలి. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా ఖచ్చితమైన క్యారంటైన్ నిబంధను పాటించాలి. ఇప్పటికే అన్ని రకా పరికరాు, మందు, సదుపాయాతో సిద్ధంగా ఉన్నాం. వైద్య పరంగా అత్యుత్తమంగా స్పందిస్తాం. అందులో సందేహం లేదు’’ అని సిఎం అన్నారు.‘‘కరోనాతో పోరాడుకుంటూనే ఇతరత్రా కూడా సిద్ధం కావాల్సి ఉంది. కొన్ని ఆర్థిక కార్యకలాపాు సాగాలి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపు అమవుతున్నాయి. కొన్ని పను జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో భవిష్యత్తులో సడలింపును ఎలా అము చేయాలి? ఏ జోన్ లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి? దేన్ని అనుమతించాలి? దేన్ని అనుమతించకూడదు? హైదరాబాద్ విషయంలో ఏ చర్యు తీసుకోవాలి? ఇతర జిల్లాల్లో ఎలా వ్యవహరించాలి? ప్రజు ఎలాంటి జాగ్రత్తు పాటించాలి. ఏయే రంగానికి ఏ సడలింపు ఇవ్వాలి? ఏ విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి?’’ తదితర అంశాల్లో అధికాయి లోతుగా ఆలోచించి, ప్రభుత్వానికి తగిన ప్రతిపాదను ఇవ్వాని ముఖ్యమంత్రి కోరారు.