క్రోని క్యాపిటల్స్‌ నుంచి ఝార్ఖండ్ ను కాపాడండి

` ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి
` ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
` ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాంచీ(జనంసాక్షి):అదానీ, అంబానీ వంటి కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్‌ నుంచి జార్ఖండ్‌ కు విముక్తి కల్పించండి… ఇండియా కూటమి అభ్యర్థులను తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎఐ సి సి సీనియర్‌ పరిశీలకుడు, స్టార్‌ క్యాంపెయినర్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం జార్ఖండ్‌ రాష్ట్రం రాంఘర్‌ నియోజక వర్గ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ లెవల్‌ విూటింగ్‌ లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. చిత్తార్పూర్‌ సీ,డీ బ్లాక్‌ రాజరప్ప బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా రaార్ఖండ్‌ ప్రజల పోరాట స్ఫూర్తిని కొనియాడారు . డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రaార్ఖండ్‌ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఏఐసీసీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మల్లిఖార్జున ఖర్గే నాయకత్వం లో రాహుల్‌ గాంధీ కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి దాకా చేసిన జోడో యాత్ర తో దేశం లో ప్రజాస్వామిక శక్తులను కం చేశారని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ రెండు సందేశాలు ఈ దేశానికి ఇచ్చారని వివరించారు. విద్వేషాలను రగిలించే వారి చేతిలో ఈ దేశాన్ని పెట్టేందుకు మేము సిద్ధంగా లేము, విశాల భారతదేశంలో ప్రేమ అనే దుకాణం తెరిచి అన్ని జాతులు, మతాలకు సమాన అవకాశాలు ఇస్తామని సందేశం ఇచ్చారని వివరించారు. అదే సందర్భంలో ఈ దేశంలోని వనరులు, సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశ ప్రజలకే చెందాలి తప్ప కొద్ది మంది క్రోనీ క్యాపిటల్‌ లిస్ట్‌ ల చేతిలో పెట్టేందుకు సిద్ధంగా లేమని సందేశం ఇచ్చారని తెలిపారు. అదాని, అంబానీ వంటి క్రోనీ క్యాపిటల్‌ లిస్ట్‌ ఈ దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ పెద్ద పోరాటం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రaార్ఖండ్‌ వనరులు రక్షించబడతాయని అన్నారు. ఈ దేశ సంపద జనాభా నిష్పత్తికి అనుగుణంగా పంపిణీ జరగాలి అంటే రాజ్యాంగాన్ని రక్షించుకొని ముందుకు పోవాలి అందుకు ఇండియా కూటమి అభ్యర్థుల ను గెలిపించడమే మన ముందు ఉన్న లక్ష్యం అని తెలిపారు. కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో జార్ఖండ్‌ రాష్ట్రాన్ని పెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని చైతన్యం గల కాంగ్రెస్‌ కార్యకర్తలు రaార్ఖండ్‌ రాష్టాన్ని, ఇక్కడి వనరులను ఆ దోపిడీ దారుల నుండి కాపాడు కోవాల్సిందిగా పిలుపు నిచ్చారు. రaార్ఖండ్‌ ప్రజలు డబ్బుకు లొంగి పోయే రకం కాదని వాళ్ళకి వివేచన, విచక్షణ ఉందనీ ఆ పరంపరను కాపాడాల్సిందిగా పిలుపు నిచ్చారు. బ్లాక్‌, గ్రామ కాంగ్రెస్‌, పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులు సమావేశమై విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఇండియా కూటమి ఇస్తున్న హావిూలు, మేనిఫెస్టోను ఓటర్లకు పెద్ద ఎత్తున వివరించాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రాంఘర్‌ అభ్యర్థి మమతా దేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని, అలాగే కూటమి అభ్యర్థులను అందరినీ గెలిపించాలన్నారు.ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీ నాయకులు గులాం అహమద్‌ విూర్‌ ,ఏఐసీసీ సెక్రటరీ సిరివెళ్ల ప్రసాద్‌, రaార్ఖండ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రెసిడెంట్‌ కేశవ్‌ కమలేష్‌ మహతో, షప్‌ా నాజ్‌ అన్వర్‌ , మైనారిటీ సెల్‌ అధ్యక్షులు తారీక్‌ అన్వర్‌ ,షకీల్‌ అహ్మద్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, మరియు స్థానిక నియోజక వర్గ నాయకులు, మండల ,గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు