కాంగ్రెస్‌ ఓబీసీలను విభజించాలని చూస్తోంది

` రaార్ఖండ్‌ సంకీర్ణ ప్రభుత్వం సహజవనరులను దోచుకుంది
` రాంచీలో రోడ్‌షోలో ప్రధాని మోదీ
రాంచీ(జనంసాక్షి): ఓబీసీలను విభజించడానికి కాంగ్రెస్‌` జేఎంఎం ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఫలించకూడదు అంటే ప్రజలు ఐక్యంగా ఉండాలని సూచించారు. ఐక్యత ఉన్నప్పుడే భద్రత ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఓబీసీలు, గిరిజనులు, దళితుల మధ్య ఐక్యత ఏర్పడనంత వరకు కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూనే ఉందని పేర్కొన్నారు.’’కాంగ్రెస్‌, జేఎంఎంలు పన్నే కుట్రల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవి ఎంతకైనా దిగజారుతాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యతకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ వ్యూహాలు పన్నుతూ దేశాన్ని దోచుకుంది. ఛోటానాగ్‌పూర్‌ ప్రాంతంలో 125 కంటే ఎక్కువ ఉపకులాలు ఓబీసలుగా పరిగణించబడుతున్నాయి. ఉపకులాలను ఒకదానితో ఒకటి ఇరకాటంలో పెట్టడం ద్వారా కాంగ్రెస్‌, జేఎంఎంలు ఓబీసీల ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని అనుకుంటున్నాయి. కాబట్టి ప్రజల్లో ఐక్యత ఉంటేనే భద్రత ఉంటుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించాలని కాంగ్రెస్‌ దాని మిత్ర పక్షాలు కోరుతున్నాయని..అది కానీ జరిగితే మళ్లీ మన సైనికులు ఉగ్రవాద దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తీసుకువచ్చారని, ఏడు దశాబ్దాలుగా అక్కడ రాజ్యాంగం అమలులో లేదని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం పేరుతో తొలిసారిగా జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారని, ఇదే అంబేద్కర్‌(ంఎపవటసజీతీ)కు ఆయన అర్పిస్తున్న నివాళి అని మోదీ అన్నారు.చొరబాటుదారులను తరిమికొట్టేందుకు, అవినీతి నిర్మూలనకు రaార్ఖండ్‌లో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం అవసరమని ప్రధాని పేర్కొన్నారు. అధికార జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణం సృష్టించిన రిక్రూట్‌మెంట్‌ మాఫియా, పేపర్‌ లీక్‌ మాఫియాలను జైలుకు పంపుతామని, యువత భవిష్యత్తుతో ఆడుకున్న వారిని వదిలిపెట్టబోమని మోదీ హెచ్చరించారు.రాష్ట్రంలోని హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందని ప్రధాని ఆరోపించారు. ఇండియా కూటమి ప్రజలను దోచుకుందని దుయ్యబట్టారు. భాజపా అధికారంలోకి వచ్చిన అనంతరం అవినీతికి పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారు.గతంలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దశాబ్ద కాలంగా రaార్ఖండ్‌కు రూ.80,000 కోట్లు కేటాయించడానికి ఇబ్బందులు పడ్డారని..తమ ప్రభుత్వం గత పదేళ్లలో రాష్ట్రానికి రూ.3లక్షల కోట్లకుపైగా నిధులు మంజూరు చేసిందని ప్రధాని వెల్లడిరచారు.
రaార్ఖండ్‌ సంకీర్ణ ప్రభుత్వం సహజవనరులను దోచుకుంది
రaార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో భారీ రోడ్‌ షో నిర్వహించారు. దాదాపు 3కి.విూల రోడ్‌షో చేపట్టిన ఆయన..ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార రథంపై నిలబడి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలు మోదీకి ఘనస్వాగతం పలికారు. రaార్ఖండ్‌ రాజధాని నగరం రాంచీలోని ఓటీసీ మైదానం వద్ద ప్రారంభమైన ఈ రోడ్‌షో న్యూ మార్కెట్‌ చౌక్‌ వద్ద ముగియనుంది. మోదీ రోడ్‌షో నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు జనం ప్రధానిని చూసేందుకు పోటెత్తారు. రోడ్‌ షోను తమ మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అంతకముందు బొకారో, గుమ్లాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ జేఎంఎం` కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జేఎంఎం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వ పాలనలో ఇసుక, అటవీ సంపద, నీటి వనరుల దోపిడీతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీకి సైతం లంచం వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజా ధనాన్ని దోచుకుంటే మోదీ సర్కార్‌ సహించదన్న ఆయన.. దోపిడీకి పాల్పడితే జైలు జీవితం గడపాల్సి ఉంటుందని హెచ్చరించారు. రaార్ఖండ్‌కు రాబోయే 25 ఏళ్లకు వచ్చే ఐదేళ్లే ఎంతో కీలకమని, ప్రజలు వేసే ఓటు రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేలా ఉండాలన్నారు.

 

తాజావార్తలు