కర్నాటక ఎన్నికల్లో బిజెపి అక్రమాలు: మంత్రి సోమిరెడ్డి

అమరావతి,మే15(జ‌నం సాక్షి ):   కర్ణాటక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. మంగళవారం కర్నాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుపొంది, కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనిపై ఆయన పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో బీజేపీ త్రిపుర తరహా రాజకీయాన్ని చేసిందని దుయ్యబట్టారు. కర్ణాటకలో రూ.10,500 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎంఎస్‌ సర్వే తేల్చిందని, అందుకే బీజేపీ అక్కడ అన్ని స్థానాలు గెలుపొందిందని అన్నారు. ఇతర పార్టీలపై ఐటీ దాడులు చేయించి బెదరగొట్టారని పేర్కొన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ కంటే బీజేపీకి తక్కువ శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఆటలు సాగవని మంత్రి సోమిరెడ్డి అన్నారు.

తాజావార్తలు