కర్షకుల కడుపు కోతకే కాళేశ్వరం

సాగు నీరు కోసం అని కట్టిన ప్రాజెక్ట్ రైతుల సావుకు కారణం అవుతుంది…
ఆర్భాటం తప్ప ఆలోచన లేకుండా నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలి…
చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజా రమేష్ బాబుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతుల చావుకు కారణమవుతుంది అని, కమిషన్ల కొరకు నిర్మాణం చేసిన కాళేశ్వరం డిజైన్ మార్చి రైతులను ఆదుకోవాలని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ రాజా రమేష్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం చెన్నూరు నియోజకవర్గం లోని ముప్పు గ్రామాలను సందర్శించి ప్రజలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలను చూసి గుండె తరించుకుపోతుంది అని ఆవేదన వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కర్షకుల కడుపు కోత కు నిర్మాణం చేసినట్టుగా వుంది అని, ముప్పు గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కనిపించడం లేదు అని విమర్శించారు. నియోజకవర్గం లోని నాలుగు మండలాల పూర్తిగా నీటి మయం అయిన కనీసం పరామర్శించడానికి కూడా ఎమ్మెల్యే రాకపోవడం, ప్రజల కష్టాలను గుర్తించకపోవడం బాధాకరం అని, హైదరాబాద్ కే పరిమితం అయ్యి అగ్ర నేతలకు ఊడిగం చేసే నాయకుడు స్థానిక ప్రజలకు అవసరం లేదు అని తెలిపారు. రానున్న రోజుల్లో బాల్క సుమన్ ను నియోజకవర్గం నుండి తరిమికొట్టే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని, అధికార అహంకారంతో విర్రవీగుతూ నియోజకవర్గం లో నియంతల వ్యవహరిస్తున్న బాల్క సుమన్ ను ఇంటికే పరిమితం చేసి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. దళిత బిడ్డగా పుట్టి నిజాం రజాకార్ల వ్యవహరిస్తూ ప్రజలను బానిసల్లా చూస్తున్నాడని, ప్రశ్నిచిన వారిపై అక్రమ కేసులు పెడుతూ, దాడులు చేస్తూ దౌర్జ్యానికి పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఉద్యమ బిడ్డగా ప్రజలను నమ్మించి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుమన్ వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడు అని ప్రశ్నించారు. రాష్ర్టంలో ఎక్కడ లేని అభివృద్ధి చెన్నూర్ కి జరిగింది అని ప్రచారం చేస్తున్న సుమన్ ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలి అని, పారిశ్రామిక ప్రాంతమైన కొల్ బెల్ట్ పట్టణంలో ప్రజలు రోడ్ల దుస్థితి చూసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. లక్షల రూపాయల విలువైన వ్యవసాయ భూములు నేడు ముప్పు ప్రాంతాలుగా మారాయని, వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగించే రైతులు పంటలు నీట మునిగి గుండెలు పగిలేలా ఆర్తనాదాలు పెడుతున్న సుమన్ కు వినిపించడం లేదా అని అన్నారు. దేశంలో రాష్ట్రంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీర్చి, అమరుల త్యాగం ఫలితంగా సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షను సఫలం చేసే విధంగా పాలన సాగుతుందని భరోసా ఇచ్చారు.

తాజావార్తలు