కాంగ్రెస్ కు రైతుల ఉసురు తగులుతుంది

శివ్వంపేట జూలై 12 జనంసాక్షి : ఎండనక, వాన అనక, ఆరుగాలం శ్రమించి పంటలు పండించె రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారిస్తున్న తీరు దుర్మార్గమైన చర్యఅనీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్ విమర్శించారు. మండల కేంద్రమైన శివ్వంపేట లోని తూప్రాన్ -నర్సాపూర్ ప్రధాన రహదారిపై బుధవారం వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డిలు మాట్లాడుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతామని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల వివరిస్తున్న తీరు సరైన చర్య కాదని వారు దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేవలం మూడు గంటల కరెంటు మాత్రమే సరఫరా చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొనడం సిగ్గుమాలిన ప్రకటనని వారు హెద్దేవా చేశారు. రైతులతో పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చుడు కళగానే మిగిలిపోయి ఆ పార్టీకీ పుట్టగతులు కూడా ఉండవని వారు హెచ్చరించారు. ఆ తర్వాత తూప్రాన్ -నర్సాపూర్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ, టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు తాటి పవన్ గుప్తా ఎంపీటీసీలు ఆకుల ఇందిరా శ్రీనివాస్, నువ్వుల దశరథ, సర్పంచులు కోళ్ల సుమలత రాజకుమార్, రంగీలా ఆంజనేయులు, బాలమణి నరేందర్, ఉప సర్పంచ్ బిక్షపతి రావు సొసైటీ డైరెక్టర్ వీరస్వామి, మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు మోకాళ్ళ నవీన్ సర్పంచ్ దంతాన్ పల్లి సర్పంచ్ కన్నారం దుర్గేష్, ఉప సర్పంచ్ ములుగు నాగేశ్వరరావు, గూడూరు సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, భోజ్య తండా సర్పంచ్ రాజు నాయక్, గుండ్లపల్లి సర్పంచ్ పెంజర్ల శ్రీనివాస్ యాదవ్, లచ్చిరెడ్డిగూడెం ఉపసర్పంచ్ రాంరెడ్డి, నాయకులు మర్రి మహేందర్ రెడ్డి, సదానందం, బుద్దుల బిక్షపతి, రామచందర్ గౌడ్ లతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజావార్తలు