కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం-మాజీ ఎమ్మెల్యే దొంతి
బీఆర్ఎస్ కి రాజీనామా కాంగ్రెస్లో చేరిక
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దొంతి
జనం సాక్షి,చెన్నరావు పేట
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా అన్నారు.బి ఆర్ ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సహించలేక శనివారం రోజు ఎల్లాయగూడెం గ్రామానికి చెందిన మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు పోతరాజు నర్సయ్య,జక్క సాయిలు, బొమ్మెర దూడాలు బిఆర్ఎస్ కి రాజీనామా చేసి గ్రామ కాంగ్రెస్ అద్యక్షులు జినుకుల కనకమల్లు,చిప్ప ఈశ్వర్ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.ఈ సందర్భంగా దొంతి మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ అరాచక పాలనను అంత మొందించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు.9 ఏళ్లలో చేయని అభి వృద్ధిని ఈ 3 నెలల కాలంలో చేస్తామని,ఇల్లు ఇప్పిస్తామని,దళిత బంధు ఇస్తామని కాంగ్రెస్ కార్యకర్తలను గ్రామాల్లో ప్రలోభాలకు గురి చేస్తున్నారని కానీ ఎన్ని మాయ మాటలు చెప్పిన వినే పరిస్థితిలో ప్రజలు లేరని, రాష్ట్రం అంత కాంగ్రెస్ వైపు చూస్తున్నదని ఈ సారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని దొంతి అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిందని,నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయలేదని,ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్తితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించదానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని దొంతి మాధవరెడ్డి అన్నారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్,డీజిల్,గ్యాస్ సిలెండర్ ధరలను పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని అందుచేత కేంద్రంలో బీజేపీ ని రాష్ట్రంలో బిఆర్ఎస్ ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని ఈ మాజీ శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అద్యక్షులు భూక్య గోపాల్ నాయక్,భాష బోయిన రమేష్,హంస భద్రయ్య,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.