కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక స్వరూపం బయటపడింది – జడ్పీటిసి నారోజి గంగారాం

రుద్రూర్ (జనంసాక్షి):వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ పథకం అనవసరమన్నట్లుగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఆయుధంగా మలుచుకుని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలను బుధవారం రోజున ఉదయం రుద్రూర్ బస్టాండ్ వద్ద చేపట్టింది, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను రోడ్డు పై కాల్చి , కాంగ్రెస్ మరియు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు.           మండల నాయకులు మాట్లాడుతూ,

జడ్పీటీసీ నారోజి గంగారాం: రేవంత్ రెడ్డి మాటలు
కాంగ్రెస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక స్వరూపాన్ని బయటపెట్టాయని , రైతే దేశనికి వెన్నుముక అన్న పార్టీలు చాలా ఉన్నాయి కానీ , రైతుల మేలు కోరి ఉచిత కరెంటు, బీమా, పెట్టుబడి ఇస్తున్న పార్టీ కేవలం బీఆర్ ఎస్ పార్టీ అని , స్పీకర్ పోచారం రైతుల కోసం నిజాంసాగర్ నీళ్లును ముందే వదిలి రైతులకు మేలు చేసారని తెలిపారు

మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్:
సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ నాయకులకు ఎందుకు అంత ఏడుపు అంటూ నిలదీశారు.

మాజీ విండో చైర్మన్ పత్తి రాము: ఉచిత కరెంట్ ఎందుకంటున్న రేవంత్ రేపు రైతుబంధు, రైతు బీమా ఎందుకంటారని… అందుకే రైతు వ్యతిరేక కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలన్నారు,
ఇంకా ఎవరైనా రైతులు కాంగ్రెస్ జెండా పట్టుకోని తిరిగితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆలోచన చెయ్యాలన్నారు.

రైతు సమితి అధ్యక్షుడు సంగయ్య :
రేవంత్ రెడ్డి ఇంట్లో 24 గంటల కరెంట్ కావాలి కానీ… రైతులకు మాత్రం 24 గంటల కరెంట్ వద్దా? పారిశ్రామిక వేత్తలకు, గృహాలకు 24గంటల విద్యుత్ ఇవ్వగా రైతులకు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. రేవంత్ మాటలపై రైతాంగం తిరుగుబాటు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, సొసైటీ చైర్మన్ బద్దం సంజీవరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తోట సంగయ్య, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, , సర్పంచ్ షేక్ ఖాదర్, రమేష్, వరప్రసాద్ ,తొట్ల గంగారాం, సర్పంచులు ఎంపీటీసీలు సొసైటీ చైర్మన్ డైరెక్టర్లు వార్డు మెంబర్లు నాయకులు , రైతులు పాల్గొన్నారు.

తాజావార్తలు