కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇస్మరిస్తే ఊరుకునేదే లేదు: డి.బి దేవేందర్
కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 31 కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంటోన్మెంట్ లో ఉన్న నాయకులను కార్యకర్తలను ప్రోత్సహించాలని డీ.బీ దేవేందర్ ఆవేదన వ్యక్తం చేస్తూవేడుకున్నారు.కంటోన్మెంట్ పికెట్ లో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ లో ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నానన్ని ఎవరు వచ్చినా పోయినా వారికి సేవలు అందిస్తూ కార్యకర్తగా మిగిలి పోవాలా అన్ని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఖమ్మంలో తెలంగాణలో ప్రాముఖ్యంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించారని ఆ విషయం తమ దృష్టికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అంత పెద్ద వ్యక్తి నియోజకవర్గానికి వస్తే తాము ఆయనను ఘనంగా ఆహ్వానించే వాళ్ళమని ఆయన వచ్చినట్టు సమాచారం కూడా అందలేదని బాధపడ్డారు.ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకీ పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానానికి సీనియర్ నాయకులకు విజ్ఞప్తి చేశారు.ఇలాంటి విషయంలో తనకు కూడా అంతే ప్రాధాన్య ఇచ్చి ప్రోత్సహించాలని ఆయన కోరారు.ఇతర ప్రాంతాల నాయకులు తెచ్చి తమ నెత్తి మీద రుద్దరాదని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు టికెట్లు ఇవ్వాలని ఆయన కోరారు.ముఖ్యంగా పిడమర్తి రవి ఖమ్మం లోనే పోటీ చేసి గెలవలేదని కంటోన్మెంట్ లో అది ఎలా సాధ్యమవుతుందని సీనియర్ నాయకులు, పార్టీ అధిష్టానం ఆలోచించాలని కోరారు. పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి ఆధిపత్యంతో కంటోన్మెంట్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని రెండు చేతులెత్తి దండం పెడుతూ విజ్ఞప్తి చేశారు.
ఆయన అనుచరుడైన పిడమర్తి రవికి కాంగ్రెస్ పార్టీ నుండి కంటోన్మెంట్ కు టికెట్ ఇప్పిస్తారని ప్రచారం జరుగుతోందని అన్నారు.