కార్తీకం అంటేనే శివరాధానలకు ప్రత్యేకం

శ్రీశైలం,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): కార్తీకం అంటేనే శివరాధానలకు ప్రత్యేకం. శివుడి ఆరాధనతో ఇహపరాలు దక్కడంతో పాటు, భవబంధాలు, పునర్జన్మలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. శివారాధనకు కార్తీకం ప్రత్యేక మాసం. దీన్ని పరమ పావనమైన కాలంగా ఎందుకు చెబుతారంటే- శివుడి విభూతి, శివానుభూతి మనిషి చైతన్యాన్ని తేజోమయం చేస్తాయి. అంతస్సీమలను జ్యోతిర్మయం చేస్తాయి.మనిషి పుట్టుకను పునీతం చేస్తాయి. నిషి జన్మకు కారణం కాముడు. అంటే మన్మథుడు. అలాగే, మరణానికి కారణం కాలుడు. అంటే, యముడు. కాలుణ్నీ, కాముణ్నీ భస్మం చేసినవాడు పరమశివుడని పురాణాలు చెబుతున్నాయి. అంటే శివానుగ్రహం లభిస్తే- పుట్టుకా ఉండదు, మరణమూ ఉండదు అని అర్థం. మనిషి జన్మకు నిజమైన గమ్యం పునర్జన్మ లేకుండా ఉండే మోక్షస్థితిని సాధించడమేనంటారు. శంకర భగవత్పాదులు నరజన్మను దుర్లభం అనడంలో రహస్యమదే! ‘ఏదో పూర్వజన్మల్లోని పుణ్యం మూలంగా మనిషిగా పుట్టావు కనుక- ఇక జన్మలులేని స్థితిని సాధించే దిశగా, ఈ జన్మను సద్వినియోగం చేసుకో’ అని శంకరుల ఆదేశం.జనన మరణ రాహిత్య స్థితి కోసం శివార్చన ముఖ్యమని దాని సందేశం. దాన్నిబట్టి కార్తికమాసం ఎంత ముఖ్యమైనదో తెలుస్తుంది బుద్ధితో కలిసి చేసే ప్రయాణాన్నే ధ్యానం అంటారు. అలా భావనామయ జగత్తులో శివుడిపట్ల బుద్ధిని నిలిపి ధ్యానం చేయడానికి మిక్కిలి అనుకూలమైన కాలం- కార్తిక మాసం! సాక్షాత్తు పరమశివుడితో అద్వైతస్థితిని అనుగ్రహించే మాసమిది. మానవ దేహాన్ని ఒక దేవాలయంగా భావన చేస్తూ, దానిలో

శివాంశను గుర్తించమని పెద్దలు బోధించారు. శివుడు జ్ఞానప్రదాత! జ్ఞానమే మోక్షానికి ముఖ్య సాధనం. కనుక మనిషి భావనతో పరిపూర్ణుడై, ధ్యానంతో ధన్యుడై, జ్ఞానంతో మోక్షార్హతను పొందడానికి ఈ కార్తిక మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి. /-యానబలంతో భగవంతుణ్ని తేలిగ్గానే దర్శించగలమని లోకానికి నిరూపించినవాడు భవభూతి మహాకవి. కార్తిక మాసాన్ని శివారాధనతో సద్వినియోగం చేసుకున్న వివేకవంతుడు- అజ్ఞానమనే పై పొరను వదుల్చుకుని మోక్షార్హతను సాధిస్తాడు. తిరిగి పుట్టవలసిన అగత్యం లేకుండా చేసుకోగలుగుతాడు. అందుకే కార్తిక మాసంలో ఉపవాస దీక్షలు, శివ ఆరాధనల అద్భుతఫలితం అంత గొప్పదంటారు.

తాజావార్తలు