కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని పోస్టుకార్డు ఉద్యమం -కాపుల ఐక్యతతోనే హక్కుల సాధన.. -మున్సిపల్ మాజీ చైర్మన్ రాజయ్య..
జిల్లాప్రతినిధి పెద్దపల్లి, జూలై07(ప్రజాదర్బార్):
రాష్ట్రంలో అత్యధిక శాతంలో మున్నురూకాపులున్నా, ఆశించిన రీతిలో ప్రయోజనాలు ప్రభుత్వం నుండి అందడంలేదని, మున్నూరుకాపుల్లో ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, దీనికి అనుగుణంగా మున్నూరుకాపు చైతన్యయాత్ర చేపట్టనున్నట్లు మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలువాక రాజయా అన్నారు. శుక్రవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షులు అమీరిశెట్టి రామస్వామి, యూత్ రాష్ట్ర కన్వీనర్ ఆకుల స్వామివివేక్ పటేల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో 40 లక్షలకు పైగా మున్నూరుకాపులు ఉన్నారని, రాష్ట్ర జనాభాలో 24 శాతం వున్నా ఆశించిన ప్రయోజనాలు లేవన్నారు. వాస్తవానికి మున్నూరుకాపుల్లో కొరవడిన ఐక్యతతోనే నష్టపోతున్నామన్నారు. మున్నూరుకాపుల్లో ఐక్యత సాధనకోసం, హక్కుల సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్రలను చేపట్టడం జరుగుతోందన్నారు. అన్నిపార్టీల్లో మున్నూరుకాపులు ఉన్నారని అన్నారు. రాష్ట్ర యూత్ కన్వీనర్ స్వామి వివేక్ పటేల్ , పెద్దపెల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు అమీర్ శెట్టి రామస్వామి, జిల్లా అధ్యక్షులు మలక రామస్వామి, మున్నూరుకాపు ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు ఆకుల రమేష్, వైద తిరుపతి, ఉనుకొండ రాజు, తూముల రవితేజ, తదితరులు పాల్గొన్నారు.