కార్మిక హక్కుల పరిరక్షనే మా లక్ష్యం……శాంతిఖని గని బాయి బాటలో లో కాంపెల్లి సమ్మయ్య
బుధవారం వెజ్ బోర్డు సభ్యులు యూనియన్ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు
శాంతిఖని పిట్ సెక్రటరీ పారిపెల్లి శివ అధ్వర్యంలో కార్మికుల చెంతకు వెల్లడం జరిగింది
ఈ కార్యక్రమానికి ఐఎన్టి యుసి జనరల్ సెక్రటరీ కాంపెల్లి సమ్మయ్య హాజరై మాట్లాడుతు పదకొండోవ వెజ్ బోర్డు చర్చ లలో వెజ్ సభ్యులు,ఐఎన్ టియుసి సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ మెరుగైన వేతన ఒప్పందం,25% అలవెన్సుల* పెరుగుదలకు కృషి చేశారని,
2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి వచ్చిన 2222 కోట్ల రూపాయల లాభాల నుండి కార్మికులకు 35% వాటాను ఆగస్టు నెలలోపు చెల్లించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మన సీఎండీ కి రాసిన లేఖలో డిమాండ్ చేశారని తెలిపారు. శాంతిఖని కార్మికులు మాట్లాడుతు అధికారులు పనిభారం మోపుతున్నరని రిటర్న్ గాలిలో పనిచేపిస్తున్నారని, పని స్థలాలలో నీటి సరఫరా చేయడం లేదని, మెటీరియల్ సప్లోయి చేయడం లేదని తెలిపారు. ఒకే గనిలో పని చేసే కార్మికులకు రెండు విధాలుగా ఇంటి కిరాయి ఇస్తున్నారని వాపోయారు.
కంపని క్వాటర్లో లలో ప్రవెట్ వ్యక్తులు ఉంటు మంచి క్వటర్లు మాకు దక్కకుండా చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంవస్సరం క్రితం మంజూరు అయిన కూడా ఘం షూ(పొడుగు బూట్లు) ను కనుగొ లు చేయక పోవటం సరి అయన విధానం కాదని మేనేజ్మెంట్ ను నిలదీయడం జరిగింది.పై సమస్యలను గని మేనేజర్,సంజయ్ కుమార్ సిహ్న,సేఫ్టీ ఆఫీసర్,రాజు అండర్ మేనేజర్ వర్ధన్, దృష్టికి తీసుకు పోగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటమని హమీ ఇచారు.