కుల,మతాల అడ్డు గోడలు మా కొద్దు! పెదలందరం ఒక్కటేనని చాటిన పోరాటం!!
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం…
పేదలు జీవించడానికి గూడు కోసం ఎంత ఆవేదన చెందుతున్నారో చెన్నూర్ లో జరుగుతున్న ఇండ్ల స్థలాల పోరాటంలో పాల్గొంటున్నవారి కండ్లల్లో కనిపిస్తున్న ఆరాటం చూసినవాళ్లకు తెలుస్తుంది.
కూలి పని చేసుకుంటనే నాలుగు ముద్దల అన్నం మెతుకులు నోటిలోకి వెళ్లి కడుపు చల్లబడే పేదలు 120 గజాల స్థలం సాధించుకోవడం కోసం వారి కడుపులు మార్చుకోవడానికైనా సిద్ధమై గత 73 రోజులుగా పోరాటం చేస్తున్నారు.
పేదలకు గూడు జాగ ఎంత అవసరమో నేటి పాలకులకు తెలియక పాయె?
పోరాటంలో పాల్గొంటున్న వారిలో ఎవరిని పలకరించిన ఒక్కొక్కరిది ఒక్కొక కన్నీటి గాధలే వినిపిస్తున్నాయి.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు నిండిన సందర్భంగా నెల రోజులు అమృతోత్సవాలు జరిపిన పాలకులకు నేటికీ గూడు గ్యారంటీ లేని పేదలను కనీసం మనసులుగా గుర్తించలేకపోయామనే సోయే లేకపాయే?
పేదలకు చెందవలసిన ప్రభుత్వ,ఆసైండ్ మెంట్,చెరువు శిఖం,పరంపోగు భూములను ప్రభుత్వ,ప్రజా ప్రతినిధుల,
అధికారుల అండతో కబ్జాదారులు,రియల్టర్లు యదేచ్ఛగా కబ్జాలు చేసుకొని తప్పుడు పత్రాలు సృష్టించి ఫ్లాట్లు చేసుకొని అమ్ముకొని కోట్లకు పడిగెత్తుతున్నారు.
ప్రభుత్వ భూమిని పట్టా భూమాని నమ్మించి ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ 50 లక్షలు పోగేసుకున్నడు. మరి తలదాసుకోవడానికి ఎన్ని అమృతొత్సవాలు జరుపుకున్న,ఈ పాలకుల మాటలు నమ్ముకున్న ఎన్నటికి గూడు కోసం జాగా దొరకదని తెలుసుకున్న పేదలు కుల మతాల అడ్డుగోడలు మాకొద్దనీ పేదలందరూ ఒకటేనని బాబురావుపేట శివారు సర్వేనెంబర్ 8లో గల 27 ఎకరాల ప్రభుత్వ భూములో సిపిఎం, ప్రజా సంఘాల అండతో గుడిసెలు వేసుకొని పోరాటం సాగిస్తున్నారు. వీరిలో దళితులు, ఆదివాసీలు,వెనుకబడిన తరగతులు, మైనార్టీలు ఇందులో 90 % శాతం మహిళలే…. పోరాడుతున్నారు.
అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల,అధికారుల అండతో కబ్జాదారులు పోలీసువారితో 22 మంది పైన రెండు క్రిమినల్,ఒకటి బైన్ డవర్ కేసు పెట్టించడం జరిగింది.ఇందులో 18 మంది మహిళలు ఉన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్లు దగ్గరుండి పేదలు వేసుకున్న గుడిసెలను కబ్జాదారులతో కూల్చివేయించి కర్రలు,చీరలు,పరదలను
పెట్రోల్ పోసి కాల్చివేయించారు.ప్రభుత్వ భూములు కాపాడి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని కోరడమే పాపం అన్నట్లుగుంది.సీపీఎం,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు జాయింట్ కలెక్టర్,ఆర్డివో తహశీల్దార్ లకు వినతిపత్రాలివ్వడం జరిగింది.జాయింట్ కలెక్టర్ వాస్తవ వివరాలు పంపించుమంటే పది రోజుల్లో వెళ్లిపోయేవాన్ని నాకెందుకు అని తహశీల్దార్ అంటున్న మాటల వెనుక మర్మం ఏమిటో?
ప్రభుత్వ భూములను కాపాడే వాళ్ళు ఎవ్వరో ? తహశీల్దార్ సమాధానం చెప్పాలి ?స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ సుమన్ కు సీపీఎం రాష్ట్ర నాయకత్వం వినతి పత్రం ఇవ్వగా వివరాలు తెలుసుకొని పేదలకు న్యాయం చేస్తామని హామీచ్చారు.చెన్నూర్ పట్టణంలో పలు మార్లు జరిగిన ర్యాలీలు,
సభలకు ఎర్రటి ఎండలో పేదలు భారీగా తరలిరావడం స్వచ్చందంగా కళాకారులు తమ వేషధారణలతో చిందు వెసాలు,కోయ దోర,ఎరుకల సానులు,డబ్బులు,బుడగ జంగాలు,బాల సంతులు,
డప్పులు,కోలాటబృందాలు,మత్స్యకారులు,బతుకమ్మలు,బోనాలతో ఎర్రజెండాలు,
ఎర్ర యూనిఫాం లతో చెన్నూర్ పట్టణాన్ని ఏర్రమయం చెయ్యడం జరిగింది.
జూలై 3 న ప్రజా సంఘాల పోరాట వేదిక పిలుపునందుకొని పేదలు చీమల దారలాగా పెద్ద ఎత్తున కలెక్టరేట్ కు తరలిరావడం జరిగింది.ఈ సందర్భంగా ప్రశాంతంగా ర్యాలీ,ధర్నా చేస్తున్న క్రమంలో కలెక్టర్ కనీసం వినతి పత్రం తీసుకోకుండా వెళ్ళిపోతున్న క్రమంలో ఆవేదన చెందిన పేదలు కలెక్టర్ కారును అడ్డగించడం జరిగింది.
లేని గొడవకు కారణమైన కలెక్టర్ చివరికి వినతి పత్రం తీసుకొని సమస్యలను పరిష్కరిస్తానని హామిచ్చారు.
తోపులాట సందర్భంగా మహిళల(ఇద్దరిపై) కాళ్లపై నుంచి కలెక్టర్ కారు టైర్లు వెళ్ళాయి.
73 రోజులుగా ఇంటి జాగాకోసం పోరాటం చేస్తున్న పేదలు ధనవంతులు కాదు?పాలకుల నిర్లక్ష్యానికి గురైనవారే?
ఎన్నటికైన కనికరం చూపించక పోతారానని కాంగ్రెస్,తెలుగు దేశం,
బీజేపీ,బిఆర్ఎస్ పార్టీల జెండాలు మోసినవాళ్ళే, మొస్తున్నవారే,
ఓట్లు వేసి వారినే గెలిపించి పెద్దోళ్లను చేస్తున్నవాల్లే? నేడు ఎర్ర జెండా ఒక్క చేత్తో,మరొక్క చేత్తో సద్ది మూట,సంకలో చంటి పిల్లలతో పోరాటంలోకి వచ్చారు.
పోలీస్ నిర్భందం..
సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవిని పట్టుకొని ఒక్క సిఐ లంజ కొడకా అని తిట్టడం,మరొక మగ ఎస్ఐ తన నోటి దూల ఎంత ఉందో పెదలన్న,మహిళలన్న ఎంత చులకన బుద్ధితో ఉన్నడో మాటల్లో,తన చర్యల ద్వారా చూపించాడు.మహిళలను మీకు సిగ్గుల్లేవా?మీ మోగొల్లు ఎట్లా భరిస్తున్నారు,వాళ్ళు మోగొల్లేనా?వాళ్ళను పోలీస్ స్టేషన్లో వేసి తన్నితే మీకు వాళ్ళు విడాకులిస్తే అప్పుడు తెలుస్తుందని బెదిరించడం.
మరో అడుగు ముందుకేసి పెన్షన్లు,ఉపాధి హామీ పనులను నిలిపి
చేస్తా,ఏ అటో లో వెళ్లిన వాటిని సిజ్ చేస్తానని ఉకుం జారీచేశాడు.
ఇతని చర్యలు ఎవ్వరి మెప్పుకోసం ఆరాటపడ్డాడో ప్రజలందరు గనించారు.
పోరాటంలో ఉన్నవాళ్ళల్లో కొద్ది మంది బాధలను వారి మాటల్లో..
లక్ష్మి :తన కోడలు అనారోగ్యంతో చనిపోతే ఇంటి కిరాయి దారులు శవాన్ని ఇంటికి తీసుకు రాకుండా రెండు తాళాలు వేసారు.ఓక్కవైపు కోడలు శవం,మరో వైపు పొద్దులు నిండి పురిటి నొప్పులు పడుతున్న కూతురు
ఎ దిక్కు లేని తను తన కూతుర్ని బందువులింటిలో ఉంచి,చనిపోయిన కోడలు శవాన్ని ఊరుకాని ఉరుకు తీసుకొని వెళ్లి దహన సంస్కరం చేసి తను అనుభవించిన మనో వేదనను పోరాటం సందర్భంగా చెపుతుంటే కంటికి నీరు రానివాళ్లు లేరు.
ఉమరాణి:
కిరాయి ఇంట్లో ఉంటు షాపుల్లో పనిచేస్తు తన కుటుంబాన్ని పోషించుకుంటుంది.
వచ్చే ఆదాయంలో సగం ఇంటి కిరాయికే పోతుంది.
ఇంటి జాగ వస్తె కనీసం గుడిసె వేసికొనైన బ్రతకవచ్చని పోరాటంలో పాల్గొంటుంటే షాపు యజమాని పనిలో నుంచి తొలగించడం,
ఇంటి యజమాని ఇళ్ళు ఖాళీ చేయించడంతో అనేక ఇబ్బందులు పడితు గుడిసె వద్ద ఉంటుంది.
రజిత:కిరాయి చెల్లించలేక ఇంటి స్థలాల కోసం జరుగుతున్న క్రమంలో పోరాటాన్ని తెలుసుకొని వచ్చి పోరాటంలో పాల్గొంటుంది.ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టినందుకు ఇంటి యజమానురాలు ఇల్లు ఖాళీ చేయించింది.
రుక్సానా:చాలా పేద కుటుంబం తన తమ్ముడుంటున్న కిరాయి ఇంట్లో సం.రాల తరబడి నివాసముంటుంది.సొంత ఇళ్లు కళ ఈ జీవితంలో నెరవేరని కళగా ఉంటుందని కనీసం గుడిసె జాగ వస్తే భరోసా ఉంటుందని పోరాటంలోకి వచ్చింది మైనార్టీలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు బఠానీలు,ఇనుప ముక్కలు సేకరించడం,గ్యారేజీ, షాపుల్లో పనిచేస్తు పొట్టనిప్పుకుంటున్నారు.
పద్మ: తన ఎదిగిన కొడుకులకు పెళ్ళి సంబంధాలు ఎన్ని వచ్చిన, నచ్చిన సొంత ఇల్లు లేదనే కారణంతో పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి.
తమకు 1973లో ప్రభుత్వం అసైన్డ్ చేసి ఇచ్చిన 28 గుంటల భూమిని కబ్జాదారులు ఆక్రమించుకొని బెదిరిస్తున్నారు.
న్యాయం చేయాలని అధికారులను వేడుకున్న లాభం లేకుండా పోయింది. చేసేది ఏమీ లేక ఎదిగిన కొడుకుల పెళ్లిలు జరిపించాలంటే సొంత ఇల్లు కోసం జాగా సాధించడం కోసం పోరాటంలో ఉంటుంది.
కాలేశ్వరం ముంపు బాధితుల గోడు వినేది ఎవ్వరు
కాలేశ్వరం బ్యాక్ వాటర్ మూలంగా కోటపల్లి, చెన్నూరు, వేమనపల్లి మండలాల్లో గ్రామాలకు గ్రామాలే ప్రతిఏటా ముంపున గురై పేదలు సర్వం కోల్పోతున్నారు. ప్రభుత్వాలు స్పందించి ముంపు బాధితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ఉంది.
కానీ సంవత్సరాలు గడిచిపోతున్న ఒక్క కుటుంబానికి కూడా పునరావాసం కల్పించలేదు. చేసేది ఏం లేక నేడు ముంపు బాధితులందరూ ఇళ్లస్థలాల పోరాటంలో భాగస్వాములు అవుతున్నారు.
ఇలా ఇళ్ల స్థలాల పోరాటంలో పాల్గొంటున్న ఎవరిని పలకరించిన ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి కాదాలే వినిపిస్తున్నాయి.
..ఇళ్లు కిరాయి దొరకాలంటే కులం ఒక్క అడ్డుగొడ లాగా అనిపించింది నిలుస్తుంది..
..దళితులకు ఇల్లు కిరాయి దొరగడం కత్తి మీద సాము లాంటిదే……
గ్రూపు లీడర్లు వచ్చే పెదలను అంటి పెట్టుకొని ప్రతి విషయం క్రింది వరకు తీసుకు వెళ్ళాడని 320 మంది గ్రూపు లీడర్లు చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
ఒక్క కేంద్రంలో ప్రారంభమైన పోరాటంలో చెన్నూర్, కోటపల్లి,వేమన పల్లి,
భీమరం,జైపూర్ మండల పేదలు పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు.
పెదలకు అండా..
సిపిఎం, ప్రజా సంఘాల జిల్లా,మండల,పట్టణ,రాష్ట్ర నాయకులు పెదలకు అండగా నిలబడడం.రాత్రి, పగలు గుడిసెల వద్ద పెదాలతో ఉండడం.వారు పెట్టింది తినడం పెదలందరికి కొండంత బలాన్నిచ్చింది.
కుల,మతాలు అడ్డు కాదని
నేడు 1000 గుడిసెల్లో పేదలు నివాసముంటున్నారని ఒక ప్రకటన లో
సీపీఎం మంచిర్యాల జిల్లా కమిటీ కార్యదర్శి సంకె రవి పేర్కొన్నారు.