కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమము 2023. సమావేశం
భువనగిరి టౌన్ జనం సాక్షి
కుష్టి వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమమును పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా యందు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మరియు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లెప్రసీ నోడల్ పర్సన్స్ అందరికీ డిస్టిక్ లెవెల్ వర్క్ షాప్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎల్సిడిసి సర్వే కార్యక్రమము తేదీ 16-8-2023 నుండి 31-8-2023 వరకు 14 రోజులు అన్ని గ్రామాలలో ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింటికి సర్వే నిర్వహించి అనుమానితులను గుర్తించి వారికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క వైద్యాధికారి గారి ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ వై .పాపారావు , మెడికల్ ఆఫీసర్లకు మరియు లెప్రసీ నోడల్ పర్సన్స్ కు ష్టి వ్యాధి పట్ల పూర్తి అవగాహనను కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ వి డి సి పి అధికారి డాక్టర్ పి. వినోద్ కుమార్, డిపిఎన్ పి ధరణి కుమార్, జ్యోతి, సతీష్ కుమార్, మల్లేష్, బసవరాజ్, పి ఎస్ సి ల యొక్క వైద్య అధికారులు, మరియు అన్ని పీహెచ్సీల లెప్రసీ మోడల్ పర్సన్స్ పాల్గొనడం జరిగింది