కూంబింగ్ నిలిపివేయాలి.. లేదంటే బందీలకు ఏం జరిగినా మీదే బాధ్యత’
విశాఖపట్నం, ఏవోవీలో కూంబింగ్ నిలిపివేయడంతో పాటు రెండురోజుల్లో బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేయాలని మావోయిస్టు పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అలా చేయనిపక్షంలో తమ దగ్గర బందీలుగా ఉన్న నేతలకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ సభ్యుడు రమణ పేరుతో పత్రికా కార్యాలయాలకు లేఖరు చేరాయి. విశాఖ జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్, మల్కణ్‌గిరి ఎస్పీ బాక్సైట్ కంపెనీలకు అమ్ముడుపోయారని లేఖలో మావోయిస్టులు ఆరోపించారు. 35 మంది గిరిజనులను పోలీసులు అక్రమంగా నిర్భందించారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో 48 గంటలపాటు మన్యం బంద్‌కు మావయిస్టులు పిలుపునిచ్చారు