కృష్ణా, గోదావరి ఆధునీకరణ పనులు వేగవంతం: ముఖ్యమంత్రి

నరసాపురం: కృష్ణా, గోదావరి ఆధునీకరణ పనులు వేగవంతం చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం నరసాపురంలో మీడియాతో మాట్లాడారు. పామాయిల్‌ రైతులకు సంబంధించి వ్యాట్‌ ఎత్తివేశామని, ప్రతిఏటా  రూ. 50వేల కోట్ల పామాయిల్‌ దిగుమతి అవుతుందని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు రూ.2,500 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలతో రైతులకు లాభం చేకూరుతుందని వివరించారు. కాగ్‌ నివేదిక ఆధారంగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియాపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

తాజావార్తలు