కెసిఆర్ తీరుపట్ల విప్లవ సంస్థల మండిపాటు

– ఎమ్మెల్యే సాయన్నకు అధికార లాంఛనాలు ఎందుకు వర్తింప చేయలేదు…?

– అధికార పదవులు పొందని వ్యక్తికి అధికార లాంచనాల…?

– గద్దర్ మరణం కూడా రాజకీయమేనా…?

– నాలుగు విప్లవ సంస్థల సంయుక్త పత్రికా ప్రకటన…

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఆగస్టు 8 :- రాజకీయాలకు ఏదీ అనర్హంకాదు అన్నట్లుగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతీదీ రాజకీయమేనా? అని సిపిఐ(ఎం.ఎల్)కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లెపల్లి ప్రబాకర్, సిపిఐ(ఎం.ఎల్) ప్రతిఘటన కేంద్ర కార్యదర్శి షేక్ షావలి, సిపిఐ(ఎం.ఎల్)భహుజన ప్రజారాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి అనిశెట్టి రాము, సిపిఐ(ఎం.ఎల్)రాంచంద్రన్ పార్టీ అధికార ప్రతినిధి బుద్ద సత్యనారాయణ మంగళవారం రోజు ఒక సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రశ్నించారు. ప్రజా గాయకుడు గద్దర్ మరణాన్ని కూడా తన స్వార్థ రాజకీయాలకు వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, చనిపోయేటప్పుడు కూడ బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జీ.సాయన్న మ్రుతి చెందినప్పుడు తెలంగాణ దళిత భహుజన సమాజం అధికార లాంఛనంగా అంత్యక్రియలు జరిపించాలని కోరినప్పుడు పట్టించుకోని కేసీఆర్, నేడు ఎలాంటి అధికార పదవులు పొందని వ్యక్తికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఎలా జరిపిస్తారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని, గద్దర్ అనారోగ్య మ్రుతిని కూడ రాజకీయ చదరంగంలో పావుగా చేసి ఆడుకోవడం కేసీఆర్ కే చెల్లిందని ఎద్దెవా చేశారు. ఇంతకంటే సిగ్గుచేటయిన విషయం మరొకటి ఉండదని మండిపడ్డారు కవులు, కళాకారులను కిరాయి మనుషులుగా మార్చి, దారిలోకి రానివారిని పదవుల ఆశపెట్టి పబ్బం గడుపుకోవం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. రాజ్యానికి వ్యతిరేకంగా ఆట, మాట, పాట ప్రదర్శనలను బంద్ పెట్టిన వ్యక్తి, తన ప్రయోజనాలకు గద్దర్ మరణాన్ని కూడా తన ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎలా ఉపయోగించు కుంటున్నాడో? అర్థం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నాలుగు విప్లవ సంస్థలు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో గద్దర్ మ్రుతికి తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏమాత్రం నిబద్దత, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉపా తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కారులపై పెట్టిన అన్నిరకాల తప్పుడు కేసులను ఎత్తివేసి, పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న ఆదివాసి గిరిజన ప్రజలకు పూర్తి హక్కు పత్రాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

తాజావార్తలు