కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రశ్నిస్తే చంపేస్తారా? 

– అలిపిరి ఘటన రిపీట్‌ అవుతుందంటున్నారు
– బీజేపీకి జగన్‌, పవన్‌ సహకరించటం దురదృష్టకరం
– విలేకరుల సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ
కర్నూలు, ఏప్రిల్‌24(జ‌నంసాక్షి) :  కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా.. అంటూ డిప్యూటీ సీఎం కేఈ ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. అలిపిరి ఘటన రిపిట్‌ అవుతుందని సోము వీర్రాజు అంటున్నారని, కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రశ్నిస్తే చంపేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని ప్రశ్నించే వారిపై బీజేపీ బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. రాష్టాన్రికి ద్రోహం చేస్తున్న బీజేపీకి జగన్‌, పవన్‌ సహకరించడం దురదృష్టకరమన్నారు. బీజేపీ, వైసీపీ కుట్రలో పవన్‌ కల్యాణ్‌ ఓ పావుగా మిగిలారని కేఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. కేసుల నుంచి బయట పడడానికే ప్రతిపక్షనేత జగన్‌.. మోదీ భజన చేస్తూ రాష్టాభ్రివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని డిప్యూటీ సీఎం అన్నారు. సీఎం చంద్రబాబు దీక్ష రోజు పవన్‌ కల్యాణ్‌ చేసిన హడావుడి వెనుక రహస్య అజెండా ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైందని కృష్ణమూర్తి పేర్కొన్నారు. రాష్టాన్రికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడని, ఏపీ ప్రజల ప్రయోజనాలే తెదేపాకు ముఖ్యమన్నారు. ఎన్డీయేలో చేరిందే రాష్ట్ర ప్రయోజనాలకోసంమని అన్నారు. నాలుగేళ్లు ఎంతో ఓపికతో
ఆశగా ఎదురుచూశామని, కేంద్రంతో సఖ్యతగా ఉంటే ఏపీకి మంచి జరుగుతుందని ఆశించామన్నారు. కానీ బీజేపీ రాజకీయాలు చేసి ఏపీ ప్రజలను, తెదేపాను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో తెదేపాను దెబ్బీసేందుకు, భాజపా బలోపేతం అయ్యేందుకు కుట్రపూరితంగా వ్యవహరించి రాష్టాన్రికి అన్యాయంచేశారన్నారు. దీనికి వత్తాసుగా బీజేపీకి జనసేన, వైసీపీ మద్దతు పలకడం ఏపీ ప్రజల అభివృద్ధి పట్ల వారికెంత ప్రేమ ఉందో అర్థంచేసుకోవచ్చన్నారు.

తాజావార్తలు