కేబినేట్‌లో గిరిజనులకు స్థానమేదీ?
విశాఖపట్టణం,ఏప్రిల్5(జనంసాక్షి): రాష్ట్ర కేబినేట్‌లో గిరిజన ఎమ్యెల్యేకు ఎవరికీ స్థానం లేకపోవడంతో గిరిజనాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు అన్నారు. రాష్ట్రంలో ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, సాంఘిక సంక్షేమశాఖ మాదిరిగానే గిరిజన సంక్షేమ శాఖను వేరు చేయాలని డిమాండు చేశారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టపర్చుకుంటేనే అందరికీ భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హావిూ ఒక్కటీ కూడా నెరవేర్చలేదన్నారు. ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు చేసేదేవిూ లేదన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక ¬దా సాధన, బాక్సైట్ తవ్వకాల రద్దుపై కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోదందని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంత్యుత్సవాల సందర్భంగా దశల వారీగా 125 విగ్రహాలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోకి మన్యంలో పనిచేసే నాయకులకు అవకాశం రావటం మంచి పరిణామంగా మాజీ మంత్రి బాలరాజు పేర్కొన్నారు.