కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

 

మల్దకల్ సెప్టెంబర్ 27(జనంసాక్షి )స్వాతంత్ర సమరయోధులు,తెలంగాణ పోరాట యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారము కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న మాట్లాడుతూ నిరంకుశ నిజాం వ్యతిరేక,తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు.1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు,ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు.ఆయన జన్మదినం పురస్కరించుకొని వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలోటిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటన్న,ఎంపీటీసీ లక్ష్మన్న, టిఆర్ఎస్ నాయకులు నాయకి మధు,చెట్టు కింద గోవిందు, పరశురాముడు,ఉప్పరి నారాయణ,తిమ్మరాజు,బంగి గోవిందు సిబ్బంది రెహమాన్ ,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.