కొత్త మత్స్య సహకార సంఘాల నమోదులో రాష్ట్రంలోనే నాగర్ కర్నూల్ జిల్లా అగ్రగామి.

‎నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవలే నిర్వహించిన ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మత్స్యకారుల సభ్యత్వ నమోదులో నాగర్ కర్నూల్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినందుకు సోమవారం హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మప్పను శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మప్ప మాట్లాడుతూ…….
జిల్లాలో మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాలు మత్స్య సంపద ద్వారా గరిష్టంగా లబ్ధిపొందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా వివిధ నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను వదలడం ద్వారా వ్యవసాయం మరియు మత్స్య పరిశ్రమతో సహా అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తోం దన్నారు.ఈ జలవనరులు నామమాత్రపు రుసుముతో మత్స్యకారుల సహకార సంఘాలకు లీజుకు ఇవ్వబడ్డాయని, జిల్లాలో లోతట్టు చేపల వేటను లాభదాయకమైన వృత్తిగా మార్చిందన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో మత్స్యకారుల సహకార సంఘాల సంఖ్య 2014-15లో 139 నుండి 2022-23 నాటికి 224 కి పెరిగిందని,సభ్యత్వం 12500 నుండి 16200 కు పెరిగిందన్నారు. అదేవిధంగా, చేపల ఉత్పత్తి 2014-15లో 4 వేల మెట్రిక్ టన్నులకు ఉండగా 2023 ప్రస్తుతానికి 14 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందన్నారు. ఫలితంగా జిల్లాలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మత్స్య సంపద కీలక పాత్ర పోషించిందన్నారు.

సన్మానించిన జిల్లా చీప్ ప్రమోటర్:
మత్స్యసహకార సంఘాల సభ్యత్వ నమోదులో నాగర్ కర్నూల్ జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిపినందుకు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధర్ సిన్హా, కమిషనర్ లచ్చిరామ్ భూక్యలు చేత ప్రత్యేకంగా సన్మానం పొందిన జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప ను జిల్లా మత్స్య సహకార సంఘాల చీప్ ప్రమోటర్ వాకిటి అంజనేయులు పూలబొకేను ఇచ్చి శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు..

తాజావార్తలు