కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖపట్నం,ఏప్రిల్ 24(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా, కోస్తా విూదుగా రాయలసీమ వరకు ద్రోణి, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో తీరానికి సవిూపంలో అలల ఉధృతి కొనసాగుతుంది. తీరానికి ఆనుకుని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించే అవకాశం ఉందని, పోర్టు యంత్రాంగాలు, మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలుచోట్ల ఎండ తీవ్రత పెరిగి 40 డిగ్రీలకు పైబడి నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తిరుపతిలో సోమవారం 42 డిగ్రీలు నమోదైంది.